గురువారం 04 జూన్ 2020
Cinema - Jan 30, 2020 , 11:39:10

సారాతో అక్ష‌య్‌, ధ‌నుష్‌.. క‌న్‌ఫాం చేసిన యూనిట్‌

సారాతో అక్ష‌య్‌, ధ‌నుష్‌.. క‌న్‌ఫాం చేసిన యూనిట్‌

వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అక్ష‌య్ కుమార్ మ‌రో ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. అత్రంగి రే అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ధ‌నుష్‌, సారా అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి హిమాన్షు శ‌ర్మ క‌థ అందించారు. మార్చిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది ఈ చిత్రం . వ‌చ్చే ఏడాది ప్రేమికుల రోజున ( ఫిబ్ర‌వ‌రి 14)న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే అక్ష‌య్ న‌టిస్తున్న సూర్య వంశీ, ల‌క్ష్మీ బాంబ్, పృథ్వీరాజ్ చిత్రాలు సెట్స్‌పై ఉన్న సంగ‌తి తెలిసిందే. 


logo