మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 21:17:58

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ సమస్య ఉంది.. కానీ, అందరూ పాల్గొనరు : అక్షయ్‌కుమార్‌

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ సమస్య ఉంది.. కానీ, అందరూ పాల్గొనరు : అక్షయ్‌కుమార్‌

ముంబై : తన అభిమానుల కోసం అక్షయ్ కుమార్ శనివారం సోషల్ మీడియాలో ఒక వీడియో సందేశాన్ని షేర్‌ చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ సమస్య ఉన్నదని, అయితే ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనడం లేదని చెప్పారు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పటి నుంచి అనేక సమస్యలు తలెత్తాయని, అది వారి అభిమానులకు చాలా బాధ కలిగించిందన్నారు.

"డ్రగ్స్ ఒక చట్టపరమైన విషయం. ఈ పరిశ్రమపై కొందరికి సరైన అభిప్రాయం లేదు. త్వరలోనే వారు సరైన నిర్ణయానికి వస్తారని భావిస్తున్నాను. ప్రతి ప్రముఖుడు సహకరిస్తారని నాకు తెలుసు. కొందరి కారణంగా మొత్తం పరిశ్రమను ప్రతికూల దృక్పథంతో చూడవద్దని అభ్యర్థిస్తున్నాను. ఇది తప్పు" అని వీడియోలో అక్షయ్‌ కుమార్‌ సూచించారు. మీడియా శక్తిని తాను ఎలా విశ్వసిస్తున్నానో అని చెప్పిన అక్షయ్ కుమార్.. వారు తమ గొంతును కొనసాగించాలని కోరుకుంటున్నానని, అయితే ఒక సున్నితమైన వార్త ఒకరి కెరీర్ మొత్తాన్ని నాశనం చేయగలదని, సున్నితమైన రీతిలో దీన్ని డీల్‌ చేయాలని కోరారు. చాలా రోజులుగా ఏదో చెప్పాలనుకుంటున్నాను.. ఎవరితో చెప్పాలో.. ఏమి చెప్పాలో తెలియడం లేదని ఆ వీడియోలో అక్షయ్‌ తన మనోగతాన్ని వెల్లడించారు.logo