బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 19:14:35

రిసార్టుకు అక్షయ్ కుమార్..దర్యాప్తు చేస్తామన్న మంత్రి

రిసార్టుకు అక్షయ్ కుమార్..దర్యాప్తు చేస్తామన్న మంత్రి

బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ హెలికాప్డర్ పై నాసిక్ లో  రిసార్టుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా..అక్షయ్ కుమార్ ఇటీవలే హెలికాప్టర్ లో నాసిక్ లోని రిసార్ట్స్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అక్షయ్ అధికారి ప్రతినిధి స్పందించలేదు. ప్రత్యేక అనుమతి తీసుకుని నాసిక్ లో ఓ డాక్టర్ ను చూసేందుకు అక్షయ్ వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో  మహారాష్ట్ర మంత్రి భుజ్ బల్ మాట్లాడుతూ..అక్షయ్ కుమార్ నాసిక్ కు వెళ్లినట్టు ఇవాళ పత్రికల్లో చదివాను. అక్షయ్ ఎక్కడికి వెళ్లాడు.. ఎలా వెళ్లొచ్చాడో నాకు తెలియదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్షయ్ కు అనుమతివ్వడంపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని, దర్యాప్తు చేయిస్తామని అన్నారు. logo