బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మంచి నటుడే కాదు దానగుణం ఉన్న అద్భుత వ్యక్తి. ఎప్పుడైన విపత్తులు వచ్చాయంటే అక్షయ్ కుమార్ సాయం చేయడంలో ముందు ఉంటారు. గత ఏడాది కరోనా విజృంభిస్తున్న సమయంలో విరాళాలు అందించిన అక్షయ్ కుమార్ కరోనా సెకండ్ వేవ్ సమయంలోను విరాళం ఇచ్చారు. ఇక తాజాగా 3600 మంది డ్యాన్సర్స్కు నెలవారి రేషన్ సరకులు అందించడానికి ముందుకొచ్చారు.
బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య 50వ బర్త్ డే సందర్భంగా అక్షయ్ కుమార్ నీకు ఎమి కావాలో కోరుకో అని అడిగారు. దానికి ఆచార్య ..పదహారు వందలమంది జూనియర్ కొరియోగ్రాఫర్లు, వృద్ధ నృత్యకారులకు ఒక నెల రేషన్తో పాటు సుమారు 2000 మంది ఇతర సహాయ డ్యాన్సర్లకు సహాయం చేయమని కోరినట్టు తెలిపాడు. అయితే దీనికి వెంటనే అక్షయ్ అంగీకరించారు. కాగా, గణేష్ ఆచార్య ఫౌండేషన్ ద్వారా కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పలు ప్రాంతాల ప్రజలకు ఈ కొరియోగ్రాఫర్ ఎన్నో సాయాలు చేస్తున్నారు.