సోమవారం 25 మే 2020
Cinema - Mar 29, 2020 , 19:26:55

ట్వింకిల్ తో కారులో ముంబై రోడ్ల‌పైకి అక్ష‌య్..వీడియో

ట్వింకిల్ తో కారులో ముంబై రోడ్ల‌పైకి అక్ష‌య్..వీడియో

ముంబై: క‌రోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మ‌హారాష్ట్ర‌తోపాటు దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇంత క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ త‌న భార్య ట్వింకిల్ ఖ‌న్నాతో ఉద‌యం ఇంటి నుంచి కారులో బ‌య‌ట‌కు వెళ్లాడు. ఎందుక‌నుకుంటున్నారా..? ట‌్వింకిల్ ఖ‌న్నా కాలుకు గా యం కావ‌డంతో..ఆస్ప‌త్రికి తీసుకెళ్లి చూపించాడు. అక్ష‌య్ ముఖానికి మాస్క్ క‌ట్టుకుని డ్రైవింగ్ చేస్తుండ‌గా..ప‌క్క‌నే ఉన్న ట్వింకిల్ వీడియో తీసింది.

ఎడారిగా ఉన్న రోడ్డు మార్గంలో ఆస్ప‌త్రి నుంచి తిరిగొస్తున్న‌పుడు..భ‌య‌ప‌డ‌కండి..అంటూ ట్వింకిల్  క్యాప్ష‌న్ ఇచ్చింది. త‌న కాలుకు బ్యాండేజ్ వేయించుకోవడానికి మాత్ర‌మే ఆస్ప‌త్రికి వెళ్లాన‌ని, క‌రోనా వైర‌స్ గురించి కాద‌ని ట్వింకిల్ ఖ‌న్నా స్ప‌ష్టం చేసింది. logo