బుధవారం 03 జూన్ 2020
Cinema - May 16, 2020 , 16:53:46

500 స్మార్ట్ బ్యాండ్స్‌ని పంచిన అక్ష‌య్ కుమార్

500 స్మార్ట్ బ్యాండ్స్‌ని పంచిన అక్ష‌య్ కుమార్

 క‌ష్ట కాలంలో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ చూపించే ఔదార్యం అంతా ఇంతాకాదు. కరోనాపై పోరాటంలో ఇప్ప‌టికే అక్ష‌య్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్లు, ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమ‌లు చేస్తున్న నాసిక్ పోలీసుల‌కి 500 స్మార్ట్ గడియారాలను విరాళంగా అందించారు. కరోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌ని గుర్తించే ఈ స్మార్ట్ బ్యాండ్స్‌ని ఇంత‌క ముందు ముంబై పోలీసుల‌కి వెయ్యి వ‌ర‌కు విరాళంగా ఇచ్చిన విష‌యం తెలిసిందే.

నాసిక్ పోలీసుల‌కి బ్యాండ్స్ ఇచ్చిన విష‌యాన్ని నాసిక్ పోలీసు కమిషనర్ విశ్వస్ నంగ్రే ధృవీకిర‌స్తూ.."500 స్మార్ట్ గడియారాలను విరాళంగా ఇచ్చినందుకు అక్ష‌య్ కుమార్ కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వీటిని 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మా ఫ్రంట్ లైన్ కార్మికులు ఉపయోగించుకుంటారు. వారి శరీర ఉష్ణోగ్రత, గుండె ప‌ల్స్ రేటు వంటివి కోవిడ్ డాష్‌బోర్డ్‌లో సేకరించబడుతుంది అని అన్నారు. కాగా, భారతదేశంలో దశలవారీగా బ్యాండ్లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ముందు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఈ బ్యాండ్లు తక్షణ ప్రాతిపదికన ఇవ్వబడుతున్నాయి


logo