బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘బెల్‌బాటమ్’. రంజిత్ ఎం తివారీ డైరెక్షన్ లో స్పై థ్రిల్లర్ గా వస్తోన్న బెల్ బాటమ్ ట్రైలర్ (Bell Bottom trailer) ను మేకర్స్ విడుదల చేశారు. 1984లో ఇండియాలో జరిగిన విమానాల హైజాక్స్ ఘటనల నేపథ్యంలో సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ‘రా’ ఏజెంట్ బెల్ బాటమ్ గా కనిపిస్తున్నాడు. ఇండియాలో వరుస హైజాకింగ్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు మొట్టమొదటి కోవర్ట్ ఆపరేషన్ చేపట్టిన ‘రా’ ఏజెంట్ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. పూజా ఎంటర్టైన్మెంట్స్, ఎమ్మా ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వాణీకపూర్, హ్యుమాఖురేషి, లారా దత్తా కీ రోల్స్ పోషిస్తున్నారు. ఆగస్టు 19న విడుదల కానుందీ చిత్రం.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో