కాలిఫోర్నియా: టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సీఈవో ఎలన్ మస్క్‌కు అమెరికా కార్మిక శాఖ వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగుల సంఘానికి వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ను డిలీట్ చేయాలని కార్మిక శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. యూనియన్‌కు వ్యతిరేకంగా 2018లో మస్క్ ఓ ట్వీట్ చేశారని, ఆ ట్వీట్ అక్రమం అని, దాన్ని తక్షణమే డిలీట్ చేయాలని అమెరికా నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డు గురువారం పేర్కొన్నది. లేబర్ రిలేషన్స్ చట్టాన్ని మస్క్ అతిక్రమించినట్లు 2019లో ఓ జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ఆ తీర్పును లేబర్ కోర్టు సమర్థించింది. తమ కంపెనీలో ఉద్యోగ యూనియన్లు చెల్లవు అని, అలా యూనియన్ పెడితే వర్కర్లకు స్టాక్ ఆప్షన్లు ఇవ్వమని ఓ ట్వీట్ మస్క్ హెచ్చరించాడు. ఆ హెచ్చరికలను లేబర్ కోర్టు తప్పుపట్టింది. తొలగించిన యూనియన్ ఉద్యోగిని కూడా మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని కోర్టు చెప్పింది. ఫ్రీమంట్లో ఉన్న కంపెనీ ప్లాంట్ ఉద్యోగులు అప్పట్లో యూనియన్‌గా మారేందుకు ప్రయత్నించారు. దాన్ని మస్క్ అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఆటో వర్కర్లులు 2018లో కోర్టును ఆశ్రయించారు.