గురువారం 28 జనవరి 2021
Cinema - Oct 30, 2020 , 01:54:34

అక్షయ్‌ సినిమా టైటిల్‌ మారింది

అక్షయ్‌ సినిమా టైటిల్‌ మారింది

అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లక్ష్మీబాంబ్‌' చిత్ర టైటిల్‌లో మార్పులు చేశారు. ఈ సినిమాను ‘లక్ష్మీ’ పేరుతో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘లక్ష్మీబాంబ్‌' టైటిల్‌పై శ్రీరాజ్‌పుత్‌ కర్నీసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. హిందు దేవతను, మత విశ్వాసాల్ని  కించపరిచేలా, అభ్యంతరకరంగా  టైటిల్‌ ఉందంటూ కర్నీ సేన చిత్రబృందానికి లీగల్‌ నోటీసులు జారీచేసింది. సినిమా పేరును మార్చాలంటూ డిమాండ్‌ చేసింది. కర్నీసేన అభ్యంతరాలతో  చిత్రబృందం సినిమా పేరును ‘లక్ష్మీ’గా మార్చింది. తమిళ చిత్రం ‘కాంచన’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి రాఘవ లారెన్స్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. ఓటీటీ ద్వారా నవంబర్‌ 9న ఈ చిత్రం విడుదలకానుంది. 


logo