బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 08, 2020 , 13:52:21

హీరోల‌లో టాప్ అక్ష‌య్, హీరోయిన్స్‌లో దీపికా

హీరోల‌లో టాప్ అక్ష‌య్, హీరోయిన్స్‌లో దీపికా

ప్ర‌ముఖ మీడియా సంస్థ  ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’  సర్వే సినీ విభాగంలో అక్ష‌య్‌, దీపికా ప‌దుకొణేలు టాప్ ప్లేస్ ద‌క్కించుకున్నారు. అత్యంత ప్రజాదరణ గల స్టార్స్ ఎవ‌ర‌నే దానిపై స‌ర్వే చేయ‌గా అక్ష‌య్ కుమార్  24 శాతం ఓట్ల‌తో తొలి స్థానం నిలిచారు. ఆయ‌న త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్ 23 శాతం ఓట్ల‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే దీపికాకి 16 శాతం ఓట్లు ప‌డ‌గా, ఆమె త‌ర్వాతి స్థానంలో ప్రియాంక 14 ఓట్ల‌తో నిలిచింది.

టాప్ 10 జాబితాలో చోటు ద‌క్కించుకున్న హీరోల విష‌యానికి వ‌స్తే..  అక్షయ్‌ కుమార్‌-24 శాతం,  అమితాబ్‌ బచ్చన్‌- 23, షారుఖ్‌ ఖాన్‌- 11,  సల్మాన్‌ ఖాన్‌- 10,  ఆమిర్‌ ఖాన్‌-6,  ఇతరులు- 6 శాతం, అజయ్‌ దేవ్‌గణ్‌-4,  హృతిక్‌ రోషన్‌-4,  రణ్‌వీర్‌ సింగ్‌-4, రణ్‌బీర్‌ కపూర్‌-2ల‌తో తొలి ప‌ది స్థానాల‌లో నిలిచారు.

ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే  దీపికకు 16 శాతం ఓట్లతో టాప్ ప్లేస్‌లో నిల‌వ‌గా ఆ త‌ర్వాత  ప్రియాంక చోప్రా- 14, కత్రినా కైఫ్‌- 13, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌-10, అనుష్క శర్మ- 9 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక ‌ అలియా భట్‌తో పాటు కంగనా రనౌత్‌ 6 శాతం ఓట్లతో సంయుక్తంగా ఏడో స్థానంలో నిలవడం విశేషం. కరీనా కపూర్‌ ఖాన్‌కు కేవలం 3 శాతం ఓట్లే పడ్డాయి.  త్వ‌ర‌లో దీపికా ప‌దుకొణే తెలుగు తెర‌కి కూడా ప‌రిచ‌యం కానున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ హీరోగా మ‌హాన‌టి ఫేం నాగ్ అశ్విన్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో దీపికా క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

తాజావార్తలు


logo