Ninne Pelladatha | అక్కినేని నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ ఎంటర్టైనర్ నిన్నే పెళ్లాడతా సినిమా వచ్చి అప్పుడే పాతికేళ్లు అయిపోయింది. నిన్నగాక మొన్నొచ్చినట్లు అనిపించే ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. 1989లో శివ సినిమాతో ఇండియన్ సినిమాను ఊపేసిన నాగార్జున.. ఆ తర్వాత ఆ స్థాయి విజయం కోసం చాలా ఏళ్ల పాటు వేచి చూడాల్సి వచ్చింది. అలాంటి సమయంలో వచ్చిన సినిమా నిన్నే పెళ్లాడతా. అన్నమయ్య లాంటి డివోషనల్ సినిమా తర్వాత అక్కినేని నాగార్జున నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ విజయం అందుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచేసింది. నాగార్జున-టబు కెమెస్ట్రీ.. కృష్ణవంశీ టేకింగ్.. సందీప్ చౌతా సంగీతం నిన్నే పెళ్లాడతా సినిమాను క్లాసిక్ అయ్యేలా చేశాయి.
బాలీవుడ్లో అప్పటికే ‘హమ్ ఆప్ హై కౌన్’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ లాంటి సినిమాలు ట్రెండ్ సెట్టర్స్ గా నిలవడంతో అలాంటి సబ్జెక్ట్ ఒకటి నాగార్జున కోసం సిద్ధం చేశాడు కృష్ణవంశీ .
దానికంటే ముందు ఓ యాక్షన్ స్క్రిప్ట్ చెప్తే అది నాగార్జునకు కూడా నచ్చింది. కానీ లొకేషన్ వేట కోసం విశాఖపట్నం వెళ్లిన కృష్ణవంశీని ఓ వ్యక్తి.. గులాబీ సినిమాను మీ గురువు వర్మలా భలే తీశారండీ అన్నాడు. దాంతో ఆలోచనలో పడిన కృష్ణవంశీ .. తన ప్రత్యేకమైన మార్క్ కోసం ఈ నిన్నే పెళ్లాడతా కథ చెప్పాడు. ఈ సినిమా అప్పట్లో వచ్చిన కుటుంబ ప్రేమకథల్లో క్లాసిక్‌గా నిలిచిపోయింది. 39 సెంటర్స్‌లో 100 రోజులు.. 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఏడాది తర్వాత తమిళంలోనూ ‘ఉన్నైయే కల్యాణమ్ పన్నికిరెన్’గా అనువాదం చేస్తే అక్కడా విజయం సాధించింది.
1996లో అవార్డుల పంట పండించింది నిన్నే పెళ్లాడతా. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకోగా.. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం అక్కినేని అవార్డు సొంతం చేసుకుంది. ఎటో వెళ్లిపోయింది మనసు పాట పాడిన రాజేశ్ కృష్ణన్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ‘నిన్నే పెళ్లాడతా’ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అప్పట్లో వచ్చిన కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
నైజాం: 3.76 కోట్లు
సీడెడ్: 2.60 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.21 కోట్లు
ఈస్ట్: 0.83 కోట్లు
వెస్ట్: 0.57 కోట్లు
గుంటూరు: 0.91 కోట్లు
కృష్ణా: 0.76 కోట్లు
నెల్లూరు: 0.54 కోట్లు
ఏపీ + తెలంగాణ: 11.26 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.74 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 12.00 కోట్లు షేర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Maa elections | మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు : పేర్ని నాని
Ram Potineni | హీరో రామ్ పోతినేనికి గాయం
Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?
చల్లని ప్రదేశంలో మంటలు రేపుతున్న లేడి కమెడీయన్..!
Nagarjuna: కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పిన నాగార్జున