బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 15:57:03

బిగ్‌బాస్‌4.. కొత్త లోగోతో సరికొత్తగా 'స్టార్‌ మా'

 బిగ్‌బాస్‌4.. కొత్త లోగోతో సరికొత్తగా 'స్టార్‌ మా'

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా బిగ్‌బాస్‌ 4 ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. కరోనా కారణంగా ఈ సారి కాస్త లేటుగా ఈ రియాలిటి షో ప్రారంభమైంది.  బిగ్‌బాస్‌4 లాంచ్‌ ఎపిసోడ్‌లో స్టార్‌ మా బ్రాండ్‌ రిఫ్రెష్‌ జరిగింది. బిగ్‌బాస్‌ 4 వ్యాఖ్యాత నాగార్జున కొత్త లోగోను ఆవిష్కరించారు. కొత్త లోగోతో స్టార్‌ మా బ్రాండ్‌ మరింత పాపులర్‌ కానుందని నాగార్జున అన్నారు.  

ఈ సందర్భంగా స్టార్‌ మా ప్రతినిధి మాట్లాడుతూ.. గత కొన్నెళ్లుగా ప్రేక్షకులు స్టార్‌ 'మా' పై కురిపిస్తున్న ప్రేమను ఎంతో సవినయంగా స్వీకరిస్తున్నామన్నారు. కేవలం వినోదాన్ని అందించే ఎంటర్‌టైనింగ్‌ బ్రాండ్‌గా మాత్రమే కాక సమాజానికి  కొ్త్త రూపునిచ్చే కథల్ని చెప్పే మాధ్యంగా కూడా ఎదగాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. 


logo