మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 18, 2020 , 20:07:38

అఖిల్ పెళ్లి బాధ్య‌త‌లు తీసుకోనున్న స‌మంత‌?

అఖిల్ పెళ్లి బాధ్య‌త‌లు తీసుకోనున్న స‌మంత‌?

లాక్‌డౌన్‌లో చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్నారు. అంద‌రి ఇండ్ల‌లో పెళ్లి బాజాలు మోగాయి. ఇప్పుడు అక్కినేని అంట కూడా మోగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎవ‌రికి అనుకుంటున్నారా? ఇంకెవ‌రు యంగ్ హీరో అఖిల్. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇలాంటి గాసిప్స్ కామ‌న్ అనుకునేలోపు అక్కినేని కోడ‌లు స‌మంత బాధ్య‌త‌లు వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం.

అంతేకాదు పెళ్లి విష‌యంపై ఇరు కుటుంబాలు చ‌ర్చించుకున్న‌ట్లు స‌మాచారం. ఇక‌ అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌డ‌మే ఆల‌స్యం. ఈ వార్త నిజ‌మే అయితే అఖిల్ కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు అన్న‌మాట‌. అఖిల్ పెళ్లి విష‌యంలో ఇప్ప‌టికే ఒక‌సారి బోల్తా ప‌డ్డాడు. శ్రేయాభూపాల్‌తో నిశ్చితార్థం అయి ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. మ‌రిది పెళ్లి బాధ్య‌త‌లు వ‌దిన తీస‌కున్న‌దిగా మ‌రేం ప‌ర్వాలేదు అన్నీ స‌వ్యంగా జ‌రుగుతాయి అంటున్నారు అభిమానులు. అక్కినేని ఫ్యామిలీ పెళ్లి విష‌యం గురించి చెప్పే వ‌ర‌కు వేచి చూడాలి. 


logo