అక్కినేని హీరోలంటేనే గ్లామర్ కి కేరాఫ్ అని చెబుతారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ మాత్రం ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు ఉన్నాడు. అందుకే రఫ్ అండ్ టఫ్ లుక్ లో కనిపించేందుకు మాస్ గా మారుతున్నాడు. కానీ ఈ కుర్రాడి అందం ముందు మాస్ కూడా మటాషే అనేలా ఉంది ఈ కొత్త స్టిల్.
ప్రస్తుతం స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డితో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఉగాది పండగరోజునే ఈసినిమా ప్రారంభమైంది. అంతేకాదు పండగ కానుకగా విడుదల చేసినపోస్టర్లు ఇప్పటికే యూత్ ని రప్ఫాడిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలైతే అక్కినేని ప్రిన్స్ ని మరవలేకపోతున్నారట. సోషల్ మీడియాలో ఏజెంట్ సినిమా ఫస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసుకుంటూ తెగ ముచ్చట్లు పెడుతున్నారట.