బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Sep 16, 2020 , 13:01:12

దివితో పెళ్లికి ముహూర్తం పెట్టాల‌న్న అఖిల్‌

దివితో పెళ్లికి ముహూర్తం పెట్టాల‌న్న అఖిల్‌

ఇప్ప‌టివ‌ర‌కు కాస్త సీరియ‌స్ గా సాగిన బిగ్ బాస్ షో సెకండ్ వీక్ కాస్త సంద‌డి వాతావ‌ర‌ణంతో షురూ అయింది. ఇంటిస‌భ్యులు పోట్లాడుకోవ‌డం మానేసి టాస్క్ లో పై ఫోక‌స్ పెట్టారు. కంటెస్టంట్లంతా పోటాపోటీగా త‌మ త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో అద‌ర‌గొట్టారు. హారిక డ్యాన్స్, దివి యాక్టింగ్, దేవి నాగ‌వ‌ల్లి త‌న కామెడీల‌తో అల‌రించారు. మంగ‌ళ‌వారం నాటి ఎపిసోడ్ లో జ‌రిగిన విష‌యాల‌పై ఓ లుక్కేస్తే..

 అభిజిత్ మోనాల్ వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మాట్లాడుకోగా..మోనాల్ కు అఖిల్ అన్నం తినిపించాడు.  మ‌రోవైపు అభిజిత్ వ‌ద్ద‌ని చెప్తున్నా హారిక అత‌నికి గోరు ముద్ద‌లు పెడుతూ అదే కంచంలో భోజ‌నం చేసింది. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యులు పాట పాడుతుంటే క‌రాటే క‌ళ్యాణి, అమ్మ‌రాజ‌శేఖర్ డ్యాన్స్ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే వెంట‌నే అమ్మ‌రాజశేఖ‌ర్ స‌డెన్ గా కింద‌ప‌డ్డ‌ట్టు న‌టించ‌డంతో ఇంటిస‌భ్యులంతా న‌వ్వుల్లో మునిగిపోయారు. మ‌రోవైపు ఈ ఘోరాన్ని తాను చూడ‌లేన‌న్న‌ట్టుగా అరియానా గ్లోరీ రెండు కండ్లు మూసుకుంది. హారిక‌కు నువ్వంటే ఇష్టం..

అనంత‌రం అభిజిత్ వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడుతూ..త‌న‌కు ముగ్గురు గ‌ర్ల్ ఫ్రెండ్స్ ఉండేవార‌ని మోనాల్ కు చెప్ప‌గా..త‌న‌కు ఒక భాయ్ ఫ్రెండ్ ఉండేవాడ‌ని మోనాల్ చెప్పింది. నాతో మాట్లాడ‌తా అని ఒట్టేయాల‌ని మోనాల్ ను అడిగాడు. మోనాల్ మాత్రం హారిక‌కు నువ్వంటే ఇష్ట‌మ‌ని చెప్ప‌గా..నేనంటే నీకు ఇష్టం లేదు క‌దా అని మోనాల్ కు అడిగాడు. నువ్వంటే ఇష్టం లేకుండే ఇలా నీతో కూర్చొని గంట‌లు గంట‌ల మాట్లాడ‌తానా..? అని మోనాల్ అభిజిత్ కు చెప్పింది. 


వినోదం కోసం బీబీ టీవీ టాస్క్‌..
అఖిల్ పులిహోర క‌లిపితే, సోహైల్ తాళింపు పులిహోర చేస్తాడ‌ని దివి చెప్పింది. అనంతరం మార్నింగ్ మ‌స్తీలో హారిక ష్టార్ట్ డ్రెస్సులో ఐట‌మ్ సాంగ్ కు స్టెప్ప‌లేసి..ఇంటిస‌భ్యుల్లో ఉత్సాహాన్ని నింపింది. అఖిల్‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేసి సంద‌డి చేసింది. ఆ త‌ర్వాత గంగ‌వ్వ‌తో క‌లిసి చేసిన స్కిట్ పేల‌గా..నోయ‌ల్ కు అంత‌గా క‌లిసిరాలేదు. మ‌రోవైపు మెహ‌బూబ్ త‌న బాడీని ఎక్స్‌పోజ్ చేసిన అనంత‌రం..దివిని ఎత్తుకుని తిప్పాడు. ఇది చూసిన అమ్మ‌రాజ‌శేఖ‌ర్ క‌రాటేక‌ళ్యాణి ఎత్తుకుని చూపించ‌రా అని స‌వాలు చేశాడు. దీనికి మెహ‌బూబ్ మొద‌ట త‌న వ‌ల్ల కాద‌ని చెప్పినా..ఆ త‌ర్వాత క‌ళ్యాణి ఎత్తుకుని ఔరా అనిపించాడు. ఇక భోజ‌నం టైంలో మోనాల్‌కు అఖిల్ అన్నం తినిపించాడు. ఇక సుజాత కన్పెష‌న్ రూంలోకి వెళ్లి టాస్క్ వివ‌రాలున్న లేఖ‌ను చ‌దివింది. వినోదం అందించే ఉద్దేశంతో బిగ్ బాస్ ఇంటిస‌భ్యుల‌కు బీబీ టీవీ టాస్క్ ఇచ్చాడు 


అత్తా అల్లుడు-అమెరికా మోజు సీరియ‌ల్ 

బీబీ టీవీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లు అత్తా అల్లుడు-అమెరికా మోజు సీరియ‌ల్ చేశారు. క‌రాటే క‌ళ్యాణి గ‌య్యాలి అత్త‌గా చేయ‌గా..ఆమె కొడుకు, కోడ‌లిగా అభిజిత్-సుజాత్‌, కూతురిగా దివి, అమెరికా అబ్బాయిగా అఖిల్ న‌టించారు. మ‌రోవైపు పుల్ల‌లు పెట్టే ప‌నిమ‌నిషిగా దేవి నాగ‌వ‌ల్లి, కుమార్ సాయి మ‌తిమ‌రుపు అకౌంటెంట్‌గా త‌మ పాత్ర‌ల్లో లీన‌మైన‌పోయారు. ఇక ఆ త‌ర్వాత సీరియ‌ల్ మ‌ధ్య‌లో వ‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ యాడ్ చేస్తున్న నోయ‌ల్, హారిక‌, అరియానా గ్లోరీ, సోహైల్ ను గంగ‌వ్వ చీపురు ప‌ట్టుకుని చిత‌క‌బాదింది. గంగ‌వ్వ చీపురు ప‌బ్లిసిటీ కోసం చేసిన యాక్టింగ్ అదిరిపోయింది. ఇక ప‌నిమ‌నిషి దేవి మాత్రం మ‌తిమ‌రుపు అకౌంటెంట్ కుమార్ సాయిని బోల్తా కొట్టింది డ‌బ్బులు లాక్కుంది. సీరియ‌ల్ కొన‌సాగుతుండ‌గా మ‌రో యాడ్ వ‌చ్చింది. మోనా్ కుటుంబం ఓ వైపు..ఆమెను చూడటానికి వ‌చ్చిన పెళ్లికొడుకుగా అమ్మ‌రాజ‌శేఖ‌ర్ గా అల‌రించారు. త‌ల‌కు విగ్గు పెట్టుకుని వచ్చిన అమ్మ‌రాజ‌శేఖ‌ర్ బ్యాచ్‌..అది నిజ‌మైన జుట్టులా బిల్డ‌ప్ ఇచ్చి ఫైన‌ల్ గా త‌మ విగ్గూడగొట్టుకున్నారు. 

దివి నాకు బాగా న‌చ్చింది: అఖిల్‌

యాడ్ పూర్త‌వ‌గానే మ‌ళ్లీ సీరియ‌ల్ మొద‌లైంది. అఖిల్, దివితో ఏకాంతంగా మాట్లాడ‌తాన‌న్నాడు. నీకు ఏ ఆహారం అంటే ఇష్ట‌మ‌ని అడిగాడు. దివి పులిహోర అంటూ స‌మాధాన‌మివ్వ‌గా..పులిహోర అంటే ఏంటో త‌న‌కు తెలియ‌ద‌న్నాడు అఖిల్‌. కానీ నిన్ను చూస్తే బాగానే క‌ల‌ప‌డం వ‌చ్చిన‌ట్ట‌నిపిస్తుందే అని దివి అనుమానంగా చూసింది. 

ఇంత‌లోనే ప‌నిమనిషి దేవి క‌ల‌గ‌జేసుకుని ఆ అబ్బాయి (అఖిల్‌) పేప‌ర్ మీద అమ్మాయి అని రాసున్నా వ‌ద‌ల‌డంటూ పెళ్లిచూపుల తంతును ర‌ద్దు చేసేందుకు ప్ర‌య‌త్నించింది. అయితే దేవి మాటలు ఏమీ ప‌నిచేయ‌లేదు. అఖిల్ మాత్రం త‌న‌కు దివి బాగా న‌చ్చింద‌ని పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయ‌మ‌న్నాడు. త‌నదైన డైలాగ్స్ తో అత్త క‌ళ్లు తెరిపించాడు అఖిల్‌. మ‌రోవైపు ప‌నిమనిషి దివి, మ‌తిమ‌రుపు అకౌంటెంట్ ను క‌లిపేశారు. ఈ త‌తంగ‌మంతా పూర్త‌య్యాక ఇంటిస‌భ్యులంతా ర్యాప్ సాంగ్ కు అదర‌గొట్టే స్టెప్పులేశారు. సీరియ‌ల్ ఎపిసోడ్ తో వినోదాన్ని పండించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతంద‌నేది తెలియాలంటే త‌ర్వాతి ఎపిసోడ్ కు వ‌ర‌కు వెయిట్ చేయాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo