అఖిల్ సార్థక్.. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఏడాది కింది వరకు ఈయనెవరో కూడా ఎవరికీ తెలియదు. కొన్ని సీరియల్స్ చేసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే బిగ్ బాస్ ఈయన కెరీర్, జాతకం రెండూ మార్చేసింది. అప్పట్నుంచి అఖిల్ పేరు మార్మోగిపోతుంది. మనోడు సోషల్ మీడియాలో కూడా బాగానే పాపులర్ అయ్యాడు. వరసగా ఏదో ఒకటి చేస్తూ ప్రేక్షకుల నోళ్లలో నానుతున్నాడు. బిగ్ బాస్ 4 కంటే ముందు అఖిల్ కొన్ని సీరియల్స్ చేసాడు. దాంతో పాటు బావ మరదలు అనే సినిమా కూడా చేసాడు. అయితే ఇవేవీ కూడా ఆయన కోరుకున్న గుర్తింపు అయితే తీసుకురాలేదు. అలాంటి సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అందులో తన కారెక్టర్ చూపించాడు అఖిల్.
ఈయన రియల్ కారెక్టర్ కు చాలా మంది అభిమానులు కూడా ఏర్పడ్డారు. అసలు షోకు వచ్చిన కొత్తలో ఎవరీ కుర్రాడు అనుకున్నారు కానీ వారం వారం గడిచేకొద్ది తనలో టాలెంట్ చూపించాడు అఖిల్. అలా ఫినాలే వరకు వచ్చాడు.. చివరికి రన్నరప్ గా నిలిచాడు. అభిజీత్ విన్నర్ అయితే ఈయన రన్నర్ అయ్యాడు. బయటికి వచ్చిన తర్వాత అభిమానులతో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. పైగా వాళ్లతో చాటింగ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ కు టైమ్ కేటాయిస్తున్నాడు. వాళ్ల కోసమే ఉంటున్నాడు అఖిల్ సార్థక్. బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ అభిమానం ఈయనపై అలాగే ఉండిపోయింది వాళ్లకు.
అందుకే అఖిల్ ఇప్పటికీ ఎప్పటికీ వాళ్లకు రుణపడిపోతానంటున్నాడు. ఇదిలా ఉంటే బయటికి వచ్చిన తర్వాత మోనాల్ తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన హీరోగా ఓ సినిమా రాబోతుంది. ప్రొడక్షన్ నెం 2 అంటూ పోస్టర్ విడుదలైంది. హేమంత్ ఆర్ట్స్ లో హేమంత్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఎప్రిల్ 13న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు విడుదల చేయనున్నారు మేకర్స్. ఏదేమైనా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తన కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు అఖిల్.