అక్కినేని అఖిల్ హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మనోడికి ఒక్క హిట్ కూడా ఇవ్వకపోవడంతో తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్పైన చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అలానే తొలి సారి సురేందర్ రెడ్డితో కలిసి ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ స్టైలిష్ స్పై థ్రిల్లర్ నుండి ఒక వైల్డ్ పోస్టర్ వచ్చింది. పోస్టర్ లో అఖిల్ నరాలు కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కండలు తిరిగి వెనుక వైపు ఉండి మరీ వైల్డ్ గా భారీ రైడ్ కి సిద్ధం అయినట్లు కనిపిస్తోంది.
ఇక ఈ రోజు నుండి చిత్ర షూటింగ్ మొదలు కానుండగా, మేకర్స్ అఖిల్ రఫ్ లుక్ ఒకటి విడుదల చేసి మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇందులో అఖిల్ లుక్ కిరాక్ పెట్టిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.థమన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.