మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 09:02:33

అఖిల్‌, మోనాల్ మ‌ధ్య వైరం.. ఇక రిలేష‌న్ బ్రేక్ అయిన‌ట్టేనా?

అఖిల్‌, మోనాల్ మ‌ధ్య వైరం.. ఇక రిలేష‌న్ బ్రేక్ అయిన‌ట్టేనా?

బిగ్ బాస్ సీజ‌న్ 4 స‌క్సెస్‌ఫుల్‌గా 79 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ఇంట్లో ఏడుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. డిసెంబ‌ర్ 20న ఫినాలే ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, సీజన్ 4 విజేత ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే సోమ‌వారం ఎపిసోడ్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగింది. లాస్య వేసిన బిగ్ బాంబ్ స్వీకరించిన అభిజిత్ కిచెన్‌లు దోస‌లు వేస్తూ క‌నిపించాడు. ఆయ‌న‌కి సాయంగా సోహైల్ ఉన్నాడు. అయితే అభిజీత్ వేసిన దోసెలు ప‌రోటాలా ఉన్నాయంటూ ఆట‌ప‌ట్టించాడు సోహైల్.

ఇక డే 1 నుండి రొమాంటిక్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న అఖిల్‌- మోనాల్ జంట ఇప్పుడు సోలోగా గేమ్‌పై దృష్టి సారించాల‌ని చూస్తుంది. గ‌త‌వారం అబ్బాయిల‌కి ధీటుగా మోనాల్ గేమ్ ఆడి హారిక‌ని కెప్టెన్ చేసింది. దీన్ని అఖిల్ త‌ట్టుకోలేక‌పోతున్నాడు. నీ వ‌ల‌న నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదైన సాయం అవ‌స‌రం అయితే త‌ప్ప‌క చేస్తా. కాని రిలేష‌న్ వ‌ద్దు. బిగ్ బాస్ గేమ్ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతుంది. నీతో రిలేష‌న్ నా గేమ్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందేమోన‌ని భ‌య‌మేస్తుంది. కొంత డిస్టెన్స్‌లో ఉంటేనే మంచిదని అఖిల్‌.. మోనాల్‌కు స‌ల‌హా ఇచ్చాడు.

నీ సోద‌రిని మ‌న ఇద్దరి గురించి భ‌య‌ట ఏమైన అనుకుంటున్నారా అని అడిగావు. మా అమ్మ‌ని నేను అద అడ‌గ‌లేదు. నీ వ‌ల‌న నేను డిస్ట్ర‌బ్ అవుతున్నాను. నువ్వు ఏదైన చేస్తే నాకు ఎఫెక్ట్ అవుతుంది. నార్మ‌ల్‌గా ఉందాం.  నీతో ఓవర్‌గా కనెక్ట్ కాను.. నాకు ఎందుకో కొడుతుంది.. నీతో నాకు వద్దు’ అంటూ మోనాల్ ముందు తేల్చి చెప్పేశాడు అఖిల్. దానికి మోనాల్ ..నేను ఒక అమ్మాయిగా  అడగాల్సిన బాధ్యత ఉంది. నీ దృష్టిలో నేను బెస్ట్ ఫ్రెండ్..  నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నావ్ ఆ టైంలో. నాకు కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి’ అంటూ అఖిల్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది మోనాల్.


logo