మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 21, 2020 , 08:09:36

కోపంతో చేతిని నేల‌కు కొట్టుకున్న అఖిల్ .. ఓదార్చిన సోహైల్

కోపంతో చేతిని నేల‌కు కొట్టుకున్న అఖిల్ .. ఓదార్చిన సోహైల్

అఖిల్‌- మోనాల్‌లు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ‌రికి అర్ధం కాదు. ఒక్కోసారి చాలా క్లోజ్‌గా మూవ్ అవుతారు. ఇంకోసారి ఇద్ద‌రు ఎవ‌రో అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తారు. శుక్ర‌వారం జ‌రిగిన కెప్టెన్సీ టాస్క్ లో మోనాల్ త‌న‌కి స‌పోర్ట్ చేయ‌లేద‌ని చాలా బాధ‌ప‌డ్డాడు అఖిల్. కోపంతో చేతిని నేల‌కేసి కొట్టాడు. సోహైల్ వెంట‌నే ఓద‌ర్చాడు. మోనాల్ కూడా ఓదార్చే ప్ర‌య‌త్నం చేసేందుకు రాగా, కొంచె ప్రైవ‌సీ కావాల‌ని అఖిల్ అన‌డంతో మోనాల్ అక్క‌డ నుండి వెళ్లిపోయింది. నన్ను న‌మ్మినందుకే హారిక‌ని గెలిపించాని మోనాల్ .. అభిజీత్ గ్యాంగ్‌తో చెప్పుకొచ్చింది 

 అనంత‌రం బిగ్ బాస్‌కు వ‌చ్చాక మీరు నేర్చుకున్న కొత్త విష‌యాలు చెప్పాల‌ని బిగ్ బాస్ అన‌డంతో ముందుగా సోహైల్.. ఫుడ్ విలువ తెలిసింది, కోపం త‌గ్గింది. ఫోన్‌కు దూరంగా ఉంటూ మ‌నుషెల‌తో హ్యాపీగా గ‌డ‌ప‌డం నేర్చుకున్నా అని అన్నాడు. ఇక అరియానా .. త‌న‌కు స‌మ‌యం విలువ బాగా తెలిసింద‌ని చెప్పుకొచ్చింది. ఇలా ఒక్కొక్క‌ళ్లు ప‌లు విష‌యాలు చెప్పుకొచ్చారు . కెప్టెన్ అయిన హారిక‌పై అభిజీత్ జోకులు వేస్తుండ‌డంతో హారిక సీరియ‌స్ అయింది. నువ్వు జోక్ చేస్తే సైలెంట్‌గా ఉండాలి, మేం వ‌స్తే సీరియ‌స్ అవుతావు అంటూ కౌంట‌ర్ ఇచ్చింది. కెప్టెన్ హారిక మైక్ వేసుకోవ‌డం మ‌ర‌చిపోవ‌డంతో బిగ్ బాస్ గుర్తు చేశారు. ఇందుకు పనిష్మెంట్‌గా అంద‌రు క‌ల‌సి  డ్యాన్స్ చేస్తూ ఇంకోసారి ఇలా చేయ‌మంటూ చెప్పుకొచ్చారు.


logo