సోమవారం 30 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 09:03:42

మెహ‌బూబ్‌పై ఫుల్ ఫైర్ అయిన అఖిల్‌

మెహ‌బూబ్‌పై ఫుల్ ఫైర్ అయిన అఖిల్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో రాక్ష‌సుల‌ని మంచి మ‌నుషులిగా మార్చేందుకు బిగ్ బాస్ మ‌రో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్ర‌కారం మంచి మ‌నుషులు కుండ‌ల‌తో నీళ్ళు తెచ్చి డ్ర‌మ్స్ నింపుతుంటే వాటిని రాక్ష‌సుల టీం అడ్డుకోవాలి. ఈ టాస్క్ కొంత ఫిజిక‌ల్ టాస్క్‌గా మారింది. మెహ‌బూబ్ కుండ‌లు ప‌గ‌ల‌గొడుతుండ‌డంతో అభిజిత్, అఖిల్ సీరియ‌స్ అయ్యారు. అఖిల్ త‌నకు దెబ్బ త‌గిలింద‌ని చూసుకొని ఆడు అంటూ మెహ‌బూబ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు పెద్ద తోపు, తురుము ఏం కాదు, ద‌మ్ముంటే నా దగ్గ‌రకు రా అని అఖిల్ గ‌రం అయ్యాడు. 

అఖిల్‌, మెహ‌బూబ్‌కు మ‌ధ్య వార్ జ‌రుగుతున్న క్ర‌మంలో ప‌గిలిని కుండ‌ల‌తో డ్ర‌మ్స్  నింపారు మంచి మ‌నుషులు. మ‌రో డ్ర‌మ్ స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేశారు. ఇది క‌రెక్ట్ కాద‌ని రాక్ష‌సుల టీం వారించిన‌ప్ప‌టికీ,  రెండు డ్ర‌మ్స్ నిండిన‌ట్టే అంటూ మంచి మ‌నుషుల‌ని విజేత‌గా ప్ర‌క‌టించారు బిగ్ బాస్.‌ దీంతో రాక్షసుల టీంలో ఉన్న అవినాష్‌ని కూడా మంచి మనిషిగా మార్చేశారు.

ఇక చివ‌రిగా మిగిలిన ఇద్దరు కొంటె రాక్షసులు అరియానా, మెహబూబ్‌లలో ఒకర్ని నేలపై ఉంచకుండా చూసుకోవాలని మంచి మనుషులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో అరియానా కాలుని కింద పెట్ట‌నీయ‌కుండా మంచి మ‌నుషులు చేయ‌డంతో దీంట్లోను మంచి మ‌నుషులు విజేత‌గా నిలిచారు. దీంతో ఈ సారి అరియానా మంచి మ‌నిషిగా మారింది. మెహబూబ్ కూడా ఏం చేయ‌లేక  వారిలో క‌లిసిపోయాడు . ఈ టాస్క్‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన అవినాష్‌, అరియానాల‌ను బెస్ట్ ప‌ర్‌ఫార్మర్‌గా నోయ‌ల్ ప్ర‌కటించాడు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య కెప్టెన్ టాస్క్ జ‌ర‌గ‌నుంది.