మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 19, 2020 , 09:14:08

త‌ల్లి ప్రేమ‌తో త‌డిసి ముద్దైన అఖిల్‌

త‌ల్లి ప్రేమ‌తో త‌డిసి ముద్దైన అఖిల్‌

బిగ్ బాస్ సీజ‌న్4 లో 74వ ఎపిసోడ్ చాలా ఎమోష‌న‌ల్‌గా సాగింది. క‌మాండ‌ర్స్‌గా మారిన హౌజ్‌మేట్స్ మార్చ్ చేస్తున్న స‌మ‌యంలో వారి త‌ల్లులు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చి వారి ముఖంలో ఆనందం చూశారు. ఎపిసోడ్ మొదట్లో సోహైల్ మ‌ట‌న్ తింటూ అవినాష్‌ని ఊరిస్తూ క‌నిపించ‌గా, ఇంటి స‌భ్యులు నేల‌పై పాకుతూ అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. టాస్క్ ఆడుతూనే  సోహైల్ కింద ప‌డుకొని తిన‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించాడు. 

మార్చ్ చేస్తున్న స‌మ‌యంలో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌ని ఫ్రీజ్ చేసి ఒక్కో ఇంటి స‌భ్యురాలి త‌ల్లిని హౌజ్‌లోకి పంపారు.  ముందుగా అఖిల్ అమ్మ దుర్గ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ స‌మ‌యంలో అఖిల్ ఫ్రీజ్‌లో ఉండ‌గా, త‌ల్లిని చూసి క‌న్నీరు పెట్టుకున్నాడు. రిలీజ్ అన్న త‌ర్వాత త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వెళ్లి చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. క‌రోనా వ‌ల‌న స‌ప‌రేట్ క్యాబిన్ ఏర్పాటు చేసి అందులో నుండే ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడించాడు బిగ్ బాస్. 

ప్ర‌తి ఒక్క‌రిని దుర్గ ప్రేమ‌గా ప‌ల‌క‌రించింది. నీలాంటి ఆడ‌పిల్ల నాకు కావాలి అని అఖిల్ త‌ల్లి అన‌డంతో హారిక ఆనందులు హ‌ద్దులు చెరిగిపోయాయి.  లాస్య అఖిల్‌కు అక్క అని, సోహైల్ సోద‌రుడు అని, అరియానా గ‌డుసు పిల్ల, మోనాల్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. వీడ్కోలు ప‌లికే స‌మ‌యంలో అద్దం వెనుకు నుండి త‌న కుమారుడికి ముద్దిచ్చి వెళ్లింది దుర్గ‌. అంద‌రిని ఆప్యాయంగా ప‌ల‌కరించడంతో అభిజీత్.. అఖిల్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అంద‌రితో చాలా బాగా మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. నా ఫ్రెండ్స్ ఇంటికి వ‌స్తే వాళ్ల‌ను అంతే బాగా చూసుకుంటుంద‌ని అఖిల్ అన్నాడు


logo