మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 22, 2020 , 09:17:29

అభిజిత్‌కు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పిన అఖిల్ సోద‌రుడు

అభిజిత్‌కు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పిన అఖిల్ సోద‌రుడు

ఇంటి స‌భ్యుల‌తో మాట్లాడాలంటే తాను అడిగిన ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధానం చెప్పాల‌ని నాగ్ అన‌డంతో అఖిల్‌.. ముందు ఒక‌లాగా, వెనుక ఒక‌లాగా ఎవ‌రుంటారు అనే వ్య‌క్తికి న‌ల్ల రోజా పువ్వు ఇచ్చాడు. ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు అభిజిత్‌. పాత ఇష్యూనే మ‌ళ్ళీ తవ్వుకొని ఇద్ద‌రు పోటాపోటీగా ఆర్గ్యుమెంట్స్  చేసుకున్నారు. వారి మ‌ధ్య నెలకొన్న స‌మ‌స్య‌ను నేను ప‌రిష్క‌రించ‌లేను. మీరే చూసుకోవాల‌ని నాగ్ అన్నారు. ఆ త‌ర్వాత అఖిల్ అన్న బ‌బ్లూ, ఆయ‌న కుమారుడు అరుష్‌ని స్టేజ్ మీద‌కు ఆహ్వానించారు.

అరుష్.. అఖిల్ బాబాయ్ బాగా ఆడుతున్నావ్ అంటూ ముద్దుముద్దుగా మాట్లాడాడు. బుడ్డోడి నాగ్ ఎత్తుకొని మ‌రీ మాట్లాడించాడు.ఇక బ‌బ్లూ మాట్లాడుతూ.. అభిజిత్ భయ్యా.. నేను నీకు పెద్ద ఫ్యాన్స్‌ని’ అంటూ హార్ట్ ఫుల్‌గా మాట్లాడాడు. మీ తమ్ముడితో రోజు ఫైట్ చేస్తుంటాను అని అభి అన‌డంతో అది గేమ్ వ‌ర‌కే అని బ‌బ్లూ అన్నాడు. ఇక‌ టాప‌క్ 5లో  సోహైల్‌, అఖిల్‌, అభిజిత్‌, అరియానా, అవినాష్‌ టాప్ 5లో ఉంటార‌ని చెప్పేసి వెళ్ళిపోయాడు. 

ఆ త‌ర్వాత .. షో కోసం అన్నివిధాలా త‌మ వంతు కృషి చేయ‌నిది ఎవ‌ర‌న్న ప్ర‌శ్న‌కు అరియానా మోనాల్ పేరు చెప్పింది. అందుకు గ‌ల కార‌ణం కూడా చెప్ప‌డంతో  అరియానా చెల్లి మృ గ‌న‌య‌ని(ముగ్గు), స్నేహితుడు కార్తీక్ వ‌చ్చారు.  టాప్ 5లో అరియానా, అఖిల్‌, సోహైల్‌, హారిక‌, అవినాష్ ఉంటార‌ని చెప్పుకొచ్చారు. ఇక పంచ్ డైలాగ్ కూడా చెప్పింది. ఆవేవాన్ని కంట్రోల్ చేసుకుంటామేమో కాని ఆభిమానాన్ని కంట్రోల్ చేసుకోలేమంటూ చెప్పుకొచ్చింది.


logo