సోమవారం 25 జనవరి 2021
Cinema - Nov 02, 2020 , 08:59:53

అవినాష్‌కు ముద్దు ఇచ్చిన మోనాల్‌.. నాకు కూడా అన్న అఖిల్

అవినాష్‌కు ముద్దు ఇచ్చిన మోనాల్‌.. నాకు కూడా అన్న అఖిల్

బిగ్ బాస్ 4లో ఆదివారం ఎపిసోడ్ అంతా చాలా ఫ‌న్‌గా సాగ‌గా, ఇంటి స‌భ్యుల‌ని ఇమిటేట్ చేయాలంటూ నాగార్జున  ఓటాస్క్ ఇచ్చారు. ముందుగా అరియానాని అవినాష్‌లా యాక్ట్ చేయాల‌ని అన్నాడు. మోనాల్ ముద్దు ఇచ్చాక అవినాష్ ఎలా మారాడు అని చేసి చూపించాల‌ని అరియానాకు చెప్ప‌డంతో ఆమె చ‌క్క‌గా ఇమిటేట్ చేసింది. అయితే త‌న‌కంటూ ఇంకా బాగా చేస్తానంటూ అవినాష్ అన‌డంతో మోనాల్ వ‌చ్చి అవినాష్‌కు ముద్దు ఇచ్చింది  దీంతో అవినాష్‌లో ఆనందం ఉర‌క‌లెత్తింది 

ఇక మోనాల్‌, అరియానాల మ‌ధ్య అవినాష్ ఎలా ప్ర‌వ‌ర్తించాడు అనే దానిని అఖిల్ ఇమిటేట్ చేశాడు. ఇందులో భాగంగా అఖిల్ .. మోనాల్ ద‌గ్గ‌ర‌కి వెళ్ళి ఒక  కిస్ అడిగాడు. అంత‌లో అరియానా అక్క‌డ‌కు రాగా, మోనాల్ నాకు కిస్ ఇస్తా అంటే వ‌ద్దు అంటున్న అని క‌వ‌ర్ చేసుకుంటున్న‌ట్టు అఖిల్ చక్క‌గా చేసి చూపించాడు. అఖిల్ ఇమిటేష‌న్‌కి హౌజ్‌మేట్స్ అంతా ఫిదా అయ్యారు. ఇక హారిక‌ని అవినాష్ ఇమిటేట్ చేయ‌గా, ప్ర‌తిసారి అభిజిత్‌ని హ‌గ్ చేస్తున్న‌ట్టు చూపించాడు. రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ కోపం వ‌స్తే ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌నేది సోహైల్‌, అవినాష్‌లు చ‌క్క‌గా ఇమిటేట్ చేశారు. 

అరియానా, లాస్య‌ల‌ను కూడా అవినాష్ ఇమిటేట్ చేయ‌గా లాస్యలా ప‌ర్‌ఫార్మెన్స్ చేసినందుకు ప‌దికిప‌ది మార్కులు ప‌డ్డాయి. ప‌ప్పు విష‌యంలో  లాస్య ఎలా ఉంటుంద‌నేది చాలా చ‌క్క‌గా చూపించాడు అవినాష్‌. ఇక ఆ త‌ర్వాత అఖిల్‌.. అభిజిత్ లా చేయ‌డం, దానికి అభి ఆరు మార్కులు ఇవ్వ‌డం వంటివి జ‌రిగాయి. అనంత‌రం ఈ వారం హౌజ్‌మేట్స్ ని కాలర్స్‌తో స‌ర్‌ప్రైజ్ చేశారు. అభిజిత్‌కు ఓ మ‌హిళా అభిమాని కాల్ చేసి ప్ర‌తి వారం నామినేట్ అవుతుండ‌డం మీకు ఎలా అనిపించింది అని అడిగింది. ప్రేక్ష‌కుల ద‌య వ‌ల‌న సేవ్ అవుతున్నా. మీ అంద‌రికి ఎప్పుడు రుణప‌డి ఉంటా అని చెప్పుకొచ్చాడు. 


logo