సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 08:48:34

గార్డెన్ ఏరియాలో గ‌ట్టిగా అరిచిన అఖిల్ అండ్ టీం.. అభి సెటైర్‌

గార్డెన్ ఏరియాలో గ‌ట్టిగా అరిచిన అఖిల్ అండ్ టీం.. అభి సెటైర్‌

బిగ్ బాస్ సీజ‌న్ 4కి సంబంధించి గురువారం ప్ర‌సారం అయిన ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్ చిన్న‌నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ముందుగా వారి ఫోటోల‌ని చూపించిన బిగ్ బాస్‌, మెమోరీస్ షేర్ చేసుకోమ‌ని కోరాడు. దీంతో అంతా వారి ఫ్యామిలీతో ఉన్న కనెక్ష‌న్‌, ఎఫెక్ష‌న్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. 40వ ఎపిసోడ్‌లో ముందుగా ఇంటి స‌భ్యులు అంద‌రు ప్లే అవుతున్న సాంగ్‌కి చిందులేశారు. ఆ త‌ర్వాత  కిచెన్‌లో కాసేపు ముచ్చ‌టించారు. అంత‌లోనే బిగ్ బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఈ వారం ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇద్ద‌రు ఇంటి స‌భ్యులు పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ ఇద్ద‌రు ఇంటి స‌భ్యులలో ఎవ‌రైతే ఎక్కువ రియ‌ల్ మ్యాంగో బాటిల్స్‌ని దించ‌కుండా తాగుతారో వారే విజేత‌లుగా నిలుస్తారు. మ‌రోవైపు బాటిల్స్‌పై ఉన్న ల‌గ్జరీ బ‌డ్జెట్ ఇంటి స‌భ్యుల‌కు ల‌భిస్తుంది. ఈ గేమ్‌లో కుమార్ సాయి, మెహ‌బూబ్ పాల్గొన‌గా ఏడు బాటిల్స్ తాగిన మెహ‌బూబ్ విజేత‌గా నిలిచాడు. ఇక‌ ఇంటి స‌భ్యుల‌కు మంచి ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ ల‌భించింది.

ఇక గార్డెన్ ఏరియాలో కూర్చొని నూడిల్స్ తింటున్న సోహైల్‌.. అరియానాని పిలిచి సారీ చెప్పాడు. నేను హ‌ర్ట్ చేస్తే సారీ, నూడిల్స్ తిను అంటూ తినిపించాడు. ఆ త‌ర్వాత అవినాష్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన అరియానా జరిగిన విష‌యాన్ని చెప్పింది. దీనిని ప‌ట్టుకొని అవినాష్ కాసేపు ఆడుకున్నాడు. నేను తినిపిస్తే తిన‌వు కాని అత‌ను తినిపిస్తే తింటావా అంటూ పులిహోర క‌లిపాడు . ఆ త‌ర్వాత అఖిల్, నోయల్, హారిక, లాస్య, సొహైల్, మోనాల్‌‌ ఇన్నాళ్ళు మైండ్ లో ఉన్ స్ట్రెస్ అంతా పోయేలా గ‌ట్టిగా అరిసారు. వీరిపై అభి సెటైర్స్ వేశాడు. 

 ఇక దివి స‌రిగా ప‌నులు చేయ‌డం లేద‌ని నోయ‌ల్‌.. అభితో గుస‌గులాడ‌గా, ఆ త‌ర్వాత హారిక కూడా వ‌చ్చి అభి, నోయ‌ల్‌తో డిస్క‌స్ చేసింది. నేను గ్రూపులు క‌ట్ట‌డం మానేసి సోలోగా ఉంటున్నాను అని అభి చెప్పుకొచ్చాడు. ఇదంతా పూర్తైన త‌ర్వాత లివింగ్ రూంలో కూర్చున్న ఇంటి స‌భ్యుల‌కు వారి చిన్న‌నాటి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు చూపించారు. అవి చూసి ఎమోష‌నల్ అయ్యారు.    ఫొటోలు చూడటం పూర్తైన తరువాత ఇంటి సభ్యులకు అవే ఫొటోలను ఫ్రేమ్ కట్టి గిఫ్ట్‌లుగా పంపించారు బిగ్ బాస్. 


logo