మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 00:23:31

అఖిల్‌ జోడీగా..

అఖిల్‌ జోడీగా..

పస్తుతం తెలుగునాట కుర్రకారు కలల రాణిగా భాసిల్లుతోంది కన్నడ కస్తూరి రష్మిక మందన్న. చూడముచ్చటైన రూపలావణ్యం, ఆకట్టుకునే అభినయంతో ఈ భామ యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. రెండేళ్ల క్రితం ‘ఛలో’ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ సొగసరి ప్రస్తుతం అగ్ర కథానాయికగా చలామణి అవుతోంది. ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ చిత్రాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అగ్ర దర్శకనిర్మాతలు తమ సినిమాల్లో కథానాయికగా తొలుత రష్మిక పేరునే పరిశీలిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’ సరనన నటిస్తోన్న ఈ సుందరి మరో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ కథానాయకుడిగా ఓ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కథానాయికగా రష్మిక మందన్నను దాదాపుగా ఖరారు చేశారని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిసింది. ఈ సినిమాతో పాటు ‘ఆచార్య’ చిత్రంలో కీలకమైన అతిథి పాత్రను పోషిస్తున్న రామ్‌చరణ్‌ సరసన రష్మిక కథానాయికగా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


logo