టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటి అఖండ (Akhanda). నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శీను (Boyapati Srinu) కలయికలో మూడోసారి వస్తోంది అఖండ. ప్రగ్యా జైశ్వాల్ ఫీమేల్ రోల్ రోల్ పోషిస్తోంది. అఖండ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విడుదలకు సంబంధించిన మరో అప్ డేట్ బయటకు వచ్చింది. అఖండ సంక్రాంతి బరిలో నిలువబోతున్నట్టు తాజా సమాచారం. కాగా ఇప్పటికే 2022 సంక్రాంతి బరిలో బ్లాక్ బాస్టర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.
భీమ్లానాయక్, రాధేశ్యామ్, సర్కారు వారి పాట సంక్రాంతి జనవరి 12, 13,14 తేదీలను ఆక్రమించేశాయి. వీటితోపాటే అఖండను కూడా విడుదల చేయాలని ద్వారకా క్రియేషన్స్ అండ్ టీం నిర్ణయించిందట. అంతేకాదు విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను కూడా లాంఛ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న అఖండలో జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది.
అఖండను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తోండగా..థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య-బోయపాటి నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ