సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం అఖండ. రీసెంట్గా చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇవి అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచాయి. మే 28న విడుదల కానున్న ఈ చిత్రం ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకోగా.. హాట్ స్టార్ ఓటీటీ హక్కుల్ని చేజిక్కించుకుంది.
ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ భారీ మొత్తంకు దక్కించుకుందని ఇన్సైడ్ టాక్. టీజర్లో బాలయ్య తన చేతిలో త్రిశూలం మెడలో రుద్రాక్షలతో అఘోరా గెటప్ లో కనిపించి సంచలనాలు సృష్టించాడు. ఈ పాత్రలో అతడి ఆహార్యం పీక్స్ కు చేరడంతో డీల్‌పై హైప్ పెరిగింది. గత చిత్రాల కన్నా ఈ సినిమాపై బాలయ్య అభిమానులలోను భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్య జైశ్వాల్ కథానాయికగా నటించింది.