ఆకాష్పూరి, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథ, మాటలు, స్క్రీన్ప్లే అందిస్తూ ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 4న సినిమాను విడుదలచేయబోతున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. స్వచ్ఛమైన ప్రేమ ఔన్యత్యాన్ని ఓ యువజంట ఎలా చాటిచెప్పిందనేది అలరిస్తుంది. హీరోగా ఆకాష్పూరికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు. రమ్యకృష్ణ, మకరంద్దేశ్పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేష్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ.