హామిల్టన్: వన్డే సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన న్యూజిలాండ్ పొట్టి సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. కాన్వే (52 బంతుల్లో 92 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభణతో శుక్రవారం తొలి టీ20లో కివీస్ 66 పరుగుల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 210 పరుగులు చేసింది. కాన్వేతో పాటు యాంగ్ (53), గప్టిల్ (35) రాణించారు. ఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది.