గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 19, 2021 , 09:49:20

బైక్‌పై 4500 కి.మీల‌ భారీయాత్ర‌కు సిద్ద‌మైన స్టార్ హీరో

బైక్‌పై 4500 కి.మీల‌ భారీయాత్ర‌కు సిద్ద‌మైన స్టార్ హీరో

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బైక్‌లు మ‌రియు రేసింగ్ అంటే ఎంత పిచ్చో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీలైనంత వ‌ర‌కు ఎక్కువ‌గా బైక్ ప్ర‌యాణాల‌కే మొగ్గు చూపే అజిత్ ప్రొఫెష‌న‌ల్ రేసింగ్ ఈవెంట్స్‌లోను పాల్గొంటూ ఉంటారు.  ఆ మ‌ధ్య వాలిమై సినిమా కోసం సొంత బైకుల‌ని తెప్పించుకొని మ‌రీ అజిత్  చేజింగ్ సీన్స్ చేసాడ‌ట‌. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు  ఆయ‌న ప్ర‌మాదం బారిన ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో అత‌ని చేతుల‌కు, కాళ్ల‌కు గాయాలు కాగా, అజిత్‌ని ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు.

తాజాగా అజిత్ వార‌ణాసి నుండి సిక్కింకు బైక్‌పై వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరుకు చెన్నై తిరిగి రానున్నాడు. సోలోగా 4500 కి.మీ బైక్ యాత్ర చేయాల‌ని అజిత్ ప్లాన్ చేసుకోగా, ఇది పూర్తైన త‌ర్వాత యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వాలిమై చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు. చివ‌రి షెడ్యూల్ కోసం టీ అంతా మొరాకోకు వెళ్ల‌నున్నారు. చిత్రంలో అజిత్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ఇందులో కథ‌నాయిక‌గా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుంది. టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు.

VIDEOS

logo