గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 03, 2020 , 02:16:52

అజయ్‌ కతుర్వార్‌, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విశ్వక్‌'

అజయ్‌ కతుర్వార్‌, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విశ్వక్‌'

అజయ్‌ కతుర్వార్‌, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విశ్వక్‌'. వేణు ముల్కల దర్శకుడు. తాటికొండ బాలకిషన్‌ నిర్మాత. టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలచేసింది. ఈ వేడుకకు దర్శకుడు వీరశంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన సందేశాత్మక చిత్రమిది. విదేశాలకు వలసవెళుతున్న వారి జీవితాల నేపథ్యంలో ఆలోచనాత్మకంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న భారత సంతతిని వదులుకోవడం సరికాదనే పాయింట్‌తో హీరో క్యారెక్టర్‌ సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు.  ‘ఎవరినీ కించపరచకుండా అందరినీ మెప్పించే సినిమా అవుతుందనే నమ్మకముంది. మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి దక్కింది’ అని హీరో అజయ్‌ పేర్కొన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్‌ వస్తోన్న ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోందని దర్శకుడు వీరశంకర్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చిత్రమిదని నిర్మాత అన్నారు. ఈ కార్యక్రమంలో అభయ్‌ బేతిగంటి తదితరులు పాల్గొన్నారు. 


logo