శనివారం 30 మే 2020
Cinema - May 09, 2020 , 13:41:24

లాక్‌డౌన్ ప్రారంభ‌మై 22 ఏళ్ళు అయిన‌ట్టు ఉంది: హీరో

లాక్‌డౌన్ ప్రారంభ‌మై 22 ఏళ్ళు అయిన‌ట్టు ఉంది:  హీరో

సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌ని ఎంట‌ర్‌టైన్ చేసే న‌టుల‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఒక‌రు. తాజాగా ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రాములో కాజోల్‌తో క‌లిసి దిగిన పాత‌ ఫోటోని షేర్ చేస్తూ..లాక్‌డౌన్ ప్రారంభ‌మై 22 ఏళ్ళు అయిన‌ట్టు ఉంది అనే కామెంట్ పెట్టారు. అజ‌య్ దేవ‌గ‌ణ్ స‌ర‌దాగా పెట్టిన ఈ కామెంట్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ పోస్ట్‌ని బ‌ట్టి చూస్తుంటే ఈ ఫోటో 22 ఏళ్ళ క్రితంది అని అర్ధ‌మ‌వుతుంది. ఇందులో ఇద్దరు చాలా యంగ్‌గా క‌నిపిస్తున్నారు.

‘హల్చుల్’ సినిమా చిత్రీకరణలో కలుసుకున్న కాజోల్‌, అజయ్ దేవ‌గ‌ణ్‌లు‌ 1999లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. వీరిద్దరూ గుండరాజ్, ఇష్క్, దిల్ క్యా కరే, రాజు చాచా, ప్యార్‌తో హోనా హి థా పలు సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా ఓం రౌత్ తెర‌కెక్కించిన థానాజీ :  ది అన్‌సంగ్ వారియ‌ర్ చిత్రంలో న‌టించారు. ఈ జంటకి 2003లో కుమార్తె నైసా, 2010లో కుమారుడు యుగ్‌ జన్మించారు.   


logo