శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 18:55:40

అజ‌య్ దేవ‌గ‌న్ సోద‌రుడు మృతి

అజ‌య్ దేవ‌గ‌న్ సోద‌రుడు మృతి

ముంబై: అజ‌య్ దేవ‌గ‌న్ క‌జిన్ బ్ర‌ద‌ర్ అనిల్ దేవ‌గ‌న్ (51) మృతిచెందారు. ఈ విష‌యాన్ని అజ‌య్ దేవ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. స్వ‌ల్ప అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న చ‌నిపోతార‌ని ఊహించ‌లేద‌ని అజ‌య్ ఆవేద‌న వ్య‌క్తంచేశాడు. నేను, కుటుంబం, చిత్ర నిర్మాణ సంస్థ ఏడీఎఫ్ఎఫ్ ఆయ‌న‌ను చాలా మిస్స‌వుతున్నామ‌ని చెప్పాడు. అనిల్ దేవ‌గ‌న్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌మ‌ను క‌లచివేసింద‌ని పేర్కొన్నాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపాడు. 

అనిల్ దేవ‌గ‌న్ 2000 సంవ‌త్స‌రంలో తీసిన రాజు చాచా సినిమా ఆయ‌నకు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ త‌ర్వాత ఆయ‌న 2005లో బ్లాక్‌మెయిల్‌, 2008లో హాల్ ఎ దిల్ చిత్రాల‌కు ద‌ర్శ‌క నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. అంత‌కుముందు 1998లో ప్యార్ తో హోనా హి తా సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా సినీరంగ ప్ర‌వేశం చేశారు. ఆ త‌ర్వాత 1999లో హిందుస్థాన్ కి క‌స‌మ్ చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. ఆ రెండు సినిమాల్లోనూ అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా న‌టించాడు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo