బుధవారం 12 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 12:51:38

సెల‌బ్రిటీల పేరుతో మోసం.. కంప్లైంట్ చేసిన ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు

సెల‌బ్రిటీల పేరుతో మోసం.. కంప్లైంట్ చేసిన ఆర్ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు

సెల‌బ్రిటీల పేరుతో కొంద‌రు కేటుగాళ్ళు అనేక మోసాల‌కి పాల్ప‌డుతున్నారు. సినిమాల‌లో ఛాన్స్ ఇప్పిస్తామ‌ని లేదంటే మోడ‌లింగ్‌లో శిక్ష‌ణ ఇప్పిస్తామ‌ని మాయ‌మాట‌లు చెబుతూ అమాయకుల‌ని బురిడీ కొట్టిస్తున్నారు. వేలాది రూపాయ‌ల‌ని త‌మ ఖాతాల‌లో జ‌మ చేసుకుంటున్నారు. తాజాగా కొంద‌రు యువ‌తులు కేటుగాళ్ల వ‌ల‌లో ప‌డి మోస‌పోగా, వారిని మోసం చేసిన వారిపై ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కి ఫిర్యాదు చేశాడు.

మోస‌పోయిన వ్య‌క్తులు అజ‌య్ భూప‌తిని సంప్ర‌దించ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. దీంతో న‌కిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి మోసం చేసే వారిపై పోలీసుల‌కి ఫిర్యాదు చేశాడు అజ‌య్. విజ‌య్ దేవ‌ర‌కొండ పేరుతోను మోసాలు జ‌రుగుతున్న‌ట్టు తాజా విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డ్డాయి. బాన్సువాడ‌కి చెందిన సాయి కిర‌ణ్ అనే వ్య‌క్తి విజ‌య్ దేవ‌ర‌కొండ‌లా మాట్లాడి మోసం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అత‌నిని అరెస్ట్ చేశారు 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo