యష్రాజ్ను హీరోగా పరిచయం చేస్తూ రామకృష్ణార్జున్ దర్శకత్వంలో సరస్వతి వెంకటేష్.ఎన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఐశ్వర్యకు తోడుగా అభిరామ్’. ‘నాంది’ ఫేమ్ నవమి నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకొంటోంది. వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుందని నిర్మాత తెలిపారు.