మిస్ యూనివర్స్గా ఆండ్రియా మేజా
4వ స్థానంలో భారత సుందరి అడిలైన్ క్యాస్టిలినో
వాషింగ్టన్, మే 17: విశ్వ సుందరి-2020 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఆండ్రాయా మేజా సొంతం చేసుకున్నారు. 26 ఏండ్ల మేజా.. మెక్సికో నుంచి ప్రపంచ సుందరి కిరీటం గెలిచిన మూడో వ్యక్తి. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి జొజిబి తుంజి ఆండ్రియాకు కిరీటాన్ని అలంకరించారు. భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించిన అడిలైన్ క్యాస్టిలినో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా గతేడాది కరోనా కారణంగా ప్రపంచ అందాల పోటీలను వాయిదా వేశారు.
మావాళ్లు చనిపోతున్నారు: మయన్మార్ మిస్ యూనివర్స్
మయన్మార్లో పౌర ప్రభుత్వాన్ని కూల్చి పాలనను హస్తగతం చేసుకున్న సైన్యం ఆకృత్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతూ ఆ దేశ యువతి థుజార్ వింట్ ల్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోటీలలో ఫైనల్కు చేరుకున్న ఆమె ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు.