గురువారం 03 డిసెంబర్ 2020
Cinema - Oct 19, 2020 , 20:44:09

ఐశ్వ‌ర్య రాజేశ్ ‘భూమిక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌మన్నా

ఐశ్వ‌ర్య రాజేశ్ ‘భూమిక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన త‌మన్నా

తమిళంతోపాటు తెలుగులో కూడా త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతు‌న్న హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేశ్ మ‌రో థ్రిల్ల‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. ‘భూమిక’ అనే టైటిల్ తో తెరకెక్క‌నున్న ఈ థ్రిల్ల‌ర్ ఐశ్వ‌ర్య రాజేశ్ కి 25వ సినిమా కావ‌డం విశేషం. ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ని త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు స‌మ‌ర్పిస్తున్నారు.

ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రేక్ష‌కుల్ని ఆద్యంతం థ్రిల్ ఫీల్ అయ్యే స‌న్నివేశాల‌తో భూమిక ను తెర‌కెక్కిస్తున్నట్లుగా నిర్మాత సుదాన్ తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన‌ మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌న్నారు.  స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాష‌‌న్ 8 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్ ద్వారా కీర్తి సురేశ్ హీరోయిన్ న‌టించిన పెంగ్విన్ చిత్రం విడుద‌లైంది. కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్ ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 



తారాగ‌ణం :

ఐశ్వ‌ర్య రాజేశ్

బ్యానర్లు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ 8 స్టూడియోస్

నిర్మాత‌లు -కార్తికేయ‌న్ సంతాన‌మ్, సుధాన్ సుంద‌ర‌మ్, జ‌య‌రామన్

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం - ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.