మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 03, 2020 , 18:51:20

ఐశ్వ‌ర్యారాయ్ చిన్న పిల్లాడిలా న‌టించొద్ద‌న్నారు..

ఐశ్వ‌ర్యారాయ్ చిన్న పిల్లాడిలా న‌టించొద్ద‌న్నారు..

ముంబై: ఐశ్వ‌ర్యారాయ్, ర‌ణ్ బీర్ క‌పూర్..ఈ రెండు పేర్లు చెప్ప‌గానే గుర్తొచ్చే సినిమా యే దిల్ హై ముష్కిల్‌. ల‌వ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ  చిత్రంలో ర‌ణ్‌బీర్-ఐష్ మ‌ధ్య కొన్ని రొమాంటిక్ రొమాంటిక్ స‌న్నివేశాలుంటాయి. అయితే సినిమాలో ఐష్ కు క్లోజ్ గా ఉండే కొన్ని స‌న్నివేశాలు చేసేందుకు ఇబ్బంది ప‌డ్డార‌ట ర‌ణ్ బీర్ క‌పూర్‌. 

ఓ ఇంట‌ర్వ్యూలోఈ విష‌య‌మై ర‌ణ్ బీర్ మాట్లాడుతూ..కొన్ని స‌న్నివేశాల్లో ఐశ్వ‌ర్యారాయ్ ను ట‌చ్ చేసే స‌మ‌మంలో ఆగిపోయాను. నా చేతుల్లో వ‌ణుకు పుట్టింది. కానీ మాత్రం కొన్ని సీన్లు తీస్తున్న స‌మ‌యంలో  చాలా కంఫ‌ర్ట‌బుల్ గా ఫీల‌వ్వాల‌ని ఐశ్వ‌ర్యారాయ్ సూచించారు. చిన్న పిల్లాడిలా న‌టించ‌డం ఆపెయ్ అని చెప్పి..రొమాంటిక్ స‌న్నివేశాలు స‌రిగ్గా వ‌చ్చేలా చేసింద‌ని చెప్పుకొచ్చాడు. ఐశ్వ‌ర్యారాయ్ త‌న కంటే సీనియ‌ర్ అయినా..ఎప్పుడూ ఓ పెద్ద స్టార్ న‌ని, యాక్ట‌ర్ న‌నే భావాన్ని పైకి క‌నిపించ‌నీయ‌లేద‌న్నాడు. యే దిల్ హై ముష్కిల్ చిత్రం నుంచి విడుద‌లైన ఐష్‌-ర‌ణ్ బీర్ హాట్ స్టిల్ష్ అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo