శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 17:57:24

ర‌వితేజతో ఇద్ద‌రు భామ‌ల రొమాన్స్..!

ర‌వితేజతో ఇద్ద‌రు భామ‌ల రొమాన్స్..!

టాలీవుడ్ యాక్ట‌ర్ ర‌వితేజ 68వ ప్రాజెక్టును ఇటీవ‌లే అధికారికంగా ప్ర‌క‌టించాడు. త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్‌లో తెర‌కెక్క‌నుందీ చిత్రం. ఖిలాడీ షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతున్న ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న ఇద్ద‌రు భామ‌లు న‌టించ‌బోతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. మ‌ల‌యాళ భామ ఐశ్వ‌ర్య‌మీన‌న్‌, క‌న్నడ శ్రీలీల మాస్‌మ‌హారాజాతో క‌లిసి స్టెప్పులేయ‌బోతున్నార‌ని టాక్‌.

ఐశ్వ‌ర్య‌మీన‌న్‌, శ్రీలీల ఇద్ద‌రికీ తెలుగులో ఇది రెండో మూవీ కావ‌డం విశేషం. ఐశ్వ‌ర్య‌మీన‌న్ ల‌వ్ ఫెయిల్యూర్ చిత్రంలో న‌టించ‌డ‌గా..శ్రీలీల పెండ్లి సంద‌డి చిత్రంలో మెరిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్స్ పై టీజీ విశ్వ ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo