శనివారం 30 మే 2020
Cinema - May 15, 2020 , 13:35:22

ప్రేక్ష‌కుల ముందుకు మాల్గుడి డేస్..!

ప్రేక్ష‌కుల ముందుకు మాల్గుడి డేస్..!

మాల్గుడి అనే ప‌ట్ట‌ణంలో ఉన్న ప‌లువురి సాధార‌ణ జీవితాల ఆధారంగా ఆర్ కె నారాయ‌ణ్ ప‌లు క‌థ‌లు రూపొందించారు. వీటిని ఆధారం చేసుకొని శంక‌ర్ నాగ్‌ మాల్గుడి డేస్‌ని రూపొందించిన సంగ‌తి తెలిసిందే. 1986లో తొలిసారి భార‌తీయ టెలివిజ‌న్‌లో ప్ర‌సారం అయింది. ఈ సీరియ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లు అందులో వారి స్నేహితులు ఎదుర్కొంటున్న స‌వాళ్ళు ఈ నేప‌థ్యంలో ఎదుర‌య్యే క‌ష్టాల గురించి చూపించారు. ఈ సీరియ‌ల్ అప్ప‌ట్లో భారతీయుల జీవితంలో ఒక భాగంగా మారింది.

మాల్గుడి డేస్‌తో అప్పటి ప్రసిద్ధ బాల నటుడు మాస్టర్ మంజునాథ్, గిరీష్ కర్నాడ్, వైశాలి కాసరవల్లి, అనంత్ నాగ్ మరియు అరుంధతి నాగ్ వంటి న‌టులు త‌మ న‌ట‌న‌తో అల‌రించారు. వీరి న‌టన‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిసింది. ఇది ప్ర‌జ‌ల జీవితాల‌కి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సీరియ‌ల్‌ని భారతదేశంలోని ప్రముఖ డిటిహెచ్ సేవా సంస్థ ఎయిర్‌టెల్ డిజిటల్ టివి .. IN10  ఓటీటీ ప్లాట్‌ఫాంతో క‌లిసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. 16మిలియ‌న్ల‌కి పైగా దీనిని వీక్షించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. మాల్గుడీ డేస్ అన్ని వయసుల ప్రేక్షకులను అల‌రిస్తుంద‌ని భావిస్తూ, తిరిగి ప్ర‌సారం చేస్తున్నాము అని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సౌర్జ్య మొహంతి అన్నారు. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు ఛానల్ 102 లో ‘మాల్గుడి డేస్’ ను కేవలం రూ.1.5తో పొందొచ్చు అని స్ప‌ష్టం చేశారు. 


logo