బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Oct 07, 2020 , 20:52:43

ఆ డాక్ట‌ర్ సుశాంత్ ది హ‌త్యేన‌న్నాడు..ఇపుడు మాట మార్చాడు..!

ఆ డాక్ట‌ర్ సుశాంత్ ది హ‌త్యేన‌న్నాడు..ఇపుడు మాట మార్చాడు..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ మృతి యావ‌త్ దేశ‌మంతా దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచార‌ణ జ‌రుపుతుంది. అయితే గ‌త‌వారం ఎయిమ్స్ డాక్ట‌ర్ సుధీర్ గుప్తా సుశాంత్ ది ఆత్మ‌హత్య కేసు అని, హ‌త్య కాద‌ని ప్ర‌క‌టించారు. ఉరేసుకోవ‌డం త‌ప్ప శరీరంపై ఎలాంటి ఎలాంటి గాయాలు లేవని సుధీర్ గుప్తా తెలిపారు. దీంతో సుధీర్ గుప్తాపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఎయిమ్స్ మెడిక‌ల్ బోర్డు డాక్ట‌ర్ సుధీర్ గుప్తా చేసిన కామెంట్స్ ను కొట్టిపారేసింది. మెడిక‌ల్ బోర్డు నివేదిక‌ను నేరుగా సీబీఐకి స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపిన బోర్డు..ఇది చ‌ట్ట‌ప‌ర‌మైన అంశం క‌నుక బోర్డు స‌మ‌ర్పించిన రిపోర్టుపై ఏవైనా ఇన్ పుట్స్ ను సీబీఐ నుంచి పొందాల్సి ఉంటుంద‌ని మెడిక‌ల్ బోర్డు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

అయితే ఇదిలా ఉంటే..తాజాగా సుశాంత్ ఫ్యామిలీ లాయ‌ర్ వికాస్ సింగ్‌ చెప్తోన్న మాట‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. 'డాక్ట‌ర్ సుధీర్ గుప్తా పూర్తిగా యూ ట‌ర్న్ తీసుకున్నారు. సుశాంత్ ది 200 శాతం హ‌త్యేన‌ని నాకు చెప్పిన అదే డాక్ట‌ర్ సుధీర్ గుప్తా. గ‌తంలో నేను డాక్ట‌ర్ పేరును చెప్ప‌లేదు. కానీ చాలా స్ప‌ష్టంగా ఇది హ‌త్య‌నేన‌ని డాక్ట‌ర్ సుధీర్ గుప్తా నాకు చెప్పారు. కానీ ఇపుడు ఆయ‌న పూర్తిగా త‌న మ‌న‌సు మార్చుకున్నాడు. ఈ విష‌యం మాకు తీవ్ర నిరాశ క‌లిగించింది. మేం సీబీఐకు రాసిన లేఖ ఈ విష‌యాన్ని తెలియ‌జేశాం. డాక్ట‌ర్ సుధీర్ గుప్తా ఎవ‌రి వ‌ల్లనైనా ఒత్తిడికి లోన‌య్యారా..? అనేది నాకు తెలియ‌దు. కానీ సుశాంత్ కుటుంబం మాత్రం మ‌రో కొత్త ఫోరెన్సిక్ బృందంతో ప‌రీక్ష‌లు జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తోంద‌ని'  వికాస్ చెప్పిన‌ట్టు నేష‌న‌ల్ మీడియా త‌న క‌థ‌నంలో రాసుకొచ్చింది.

మ‌రి సుశాంత్ సింగ్ ది హ‌త్యా..? ఆత్మ‌హ‌త్యా..? అనే దానిపై సీబీఐ అధికారులు ఏం చెప్తారో వేచి చూడాలి. 


logo