బిగ్ బాస్ కార్యక్రమంతో లైమ్ లైట్లోకి వచ్చిన కంటెస్టెంట్స్‌లో అలీ రెజా ఒకరు. బిగ్ బాస్ షోతో పాపుటారిటీ తెచ్చుకున్న అలీ..నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలో నటించే ఛాన్స్ అందుకున్నారు. అయితే ఈ చిత్రం అలీకి ఆశించినంతగా పేరు తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం ఆహ్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే ఈ మూవీ నుంచి మొదటి పాటను రిలీజ్ చేశారు.‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే చిత్రంలోను నటిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాడు.
ఇక అలీ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. భార్యతో కలిసి ఓ వీడియో షేర్ చేయగా, ఇందులో ఆయన భార్య మసూమ బేబి బంప్‌తో కనిపిస్తుంది. ఈ దంపతులు ఇద్దరికి సెలబ్స్, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మసూమ బిగ్ బాస్ షోలో అలీని కలవడానికి వచ్చినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.అలానే అలీ చేసే పలు వీడియోలలో దర్శనం ఇస్తూ నెటిజన్స్‌ని ఆకట్టుకుంటుంది. సావిత్రి సిరీయల్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అలీ ఇటూ నటుడిగా, అటూ మోడల్‌గా రాణిస్తున్నాడు.