శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 20:45:00

మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఆహా..

మూడు వారాల్లోనే ‘క్రాక్’..డిజిటల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన ఆహా..

కరోనా కాలం కావడంతో థియేటర్స్ లో సినిమాలు విడుదలైనా కూడా చాలా త్వరగానే ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్స్ కూడా ఇచ్చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కొన్ని సినిమాలు అయితే కనీసం వారం కూడా లేకుండానే ఒరిజినల్ ప్రింట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రవితేజ క్రాక్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. కాకపోతే మరీ వారం రోజుల్లో కాదు కానీ మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటిటిలో విడుదల అవుతుంది. ప్రస్తుతం థియేటర్స్‌లో మంచి వసూళ్లు సాధిస్తుంది. విడుదలైన రెండు వారాల్లో ఈ సినిమా దాదాపు 30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అది కూడా కేవలం 50 ఆక్యుపెన్సీతోనే. 100 శాతం ఉండుంటే కచ్చితంగా ఇప్పటికే 40 కోట్ల షేర్ దాటిపోయేది. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా నేపథ్యం కారణంగా సినిమాలు విడుదలైన తర్వాత త్వరగానే ఓటిటిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ముందుగానే నిర్ణయించుకుంటున్నారు.

ఈ మేరకు ముందుగానే ఒప్పందం కూడా చేసుకున్నారు. ఆ మధ్య డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. వారం రోజుల తర్వాత అంటే జనవరి 1న ఈ సినిమా ఓటిటిలో విడుదల చేసారు. జీ స్టూడియోస్ ఈ సినిమాను న్యూ ఇయర్ కానుకగా విడుదల చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ క్రాక్ సినిమా విషయంలో కూడా ఇలాంటి సీన్ రిపీట్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తుండటంతో ఓటిటి కాస్త ఆలస్యంగా రానుంది. ఒకవేళ థియేటర్స్ లో సరైన రెస్పాన్స్ రాకపోయుంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు వారాల్లోనే సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని అనుకున్నారు. 

అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే మంచి వసూళ్లతో దూసుకుపోతుండటంతో మరో మూడు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను ఆహా దాదాపు 9 కోట్లకు కొనేసిందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే జనవరి 29న క్రాక్ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసారు ఆహా యూనిట్. ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమా కావడం.. పైగా ఆహాలో విడుదల కానున్న తొలి భారీ సినిమా కావడంతో అక్కడ కూడా క్రాక్ కిరాక్ పుట్టిస్తుందని నమ్ముతున్నారు. మరి చూడాలిక.. మాస్ రాజా రచ్చ ఎలా ఉండబోతుందో..?

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌రో చిన్నారికి గుండె ఆప‌రేష‌న్ చేయించిన సోనూసూద్

' ఆర్ఎక్స్ 100' భామ‌ స్పెష‌ల్ సాంగ్..!

విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూట్ షురూ ..వీడియో

హాట్ లుక్ లో సారా హొయ‌లు..ట్రెండింగ్‌లో స్టిల్స్

వ‌రుణ్‌ధ‌వ‌న్ వెడ్డింగ్‌కు తార‌‌లు..ఫొటోలు, వీడియో

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo