రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల జంటగా నటిస్తున్న ‘అగ్రజీత’ చిత్రం ఆస్ట్రేలియాలోని డాండెనాంగ్ పట్టణంలో ఇటీవల ప్రారంభమైంది. సందీప్‌రాజ్ దర్శకుడు. ఆయన చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇదొక భిన్నమైన కథ. ఒక జీవి మరణానంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవిలోకి తీసుకు వెళ్లే సైంటిఫిక్ కథ ఇది. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కించబోతున్నాం. చిత్రీకరణ మొత్తం ఆస్ట్రేలియాలో చేయబోతున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైంది’ తెలిపారు.