శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Aug 02, 2020 , 21:26:21

జ‌ప‌నీస్ లో ' ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'

జ‌ప‌నీస్ లో ' ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'

యువ నటుడు న‌వీన్ పొలిశెట్టి న‌టించిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌. 2019లో విడుద‌లైన తెలుగు చిత్రాల్లో బాక్సాపీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబట్టి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రం. గతేడాది ఉత్త‌మ చిత్రాల్లో ఇది కూడా ఒక‌టిగా నిలిచింది. త‌క్కువ బ‌డ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ అరుదైన అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. ఈ చిత్రం జ‌పాన్ లో కూడా విడుద‌ల కానుంది. జ‌ప‌నీస్ భాష‌లో డ‌బ్బింగ్ వెర్ష‌న్ ను సెప్టెంబ‌ర్ 11న జ‌పాన్ లో విడుద‌ల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళం రీమేక్ రైట్స్ కూడా అమ్ముడిపోయాయ‌ట‌.

ఇటీవ‌లే కాలంలో ఓ తెలుగు సినిమా ఇలా ప‌లు భాష‌ల్లోకి రైట్స్ ద‌క్కించుకోవ‌డం అరుదైన విష‌యం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రాన్ని మూడు పార్టులుగా తీయ‌నున్నారు. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ ఎస్ జే సీక్వెల్ స్క్రిప్ట్ ను సిద్దం చేసే ప‌నిలో ప‌డిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌. మొద‌టి పార్టును నిర్మించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా మిగిలిన రెండు సీక్వెల్స్ ను కూడా నిర్మించ‌నున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo