శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 16:04:27

దూర‌ద‌ర్శ‌న్ లో మ‌ళ్లీ శ్రీకృష్ణ‌

దూర‌ద‌ర్శ‌న్ లో మ‌ళ్లీ  శ్రీకృష్ణ‌

క‌రోనా నియంత్ర‌ణ‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ పాటిస్తున్న వేళ ప్ర‌తి ఒక్క‌రు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నారు. పుస్త‌కాలు చ‌దువుతున్నారు. మ‌రికొంద‌రు  సీరియ‌ల్స్, భ‌క్తిప‌ర‌మైన సీరియ‌ల్స్ మిస్ కాకుండా చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో వ‌చ్చిన‌ రామాయ‌ణం, మ‌హా భార‌తం దూర‌ద‌ర్శ‌న్ లో తిరిగి ప్రారంభించ‌గా.. దానికి మంచి రేటింగ్స్ వ‌స్తోంది. జ‌నాలు పెద్ద‌సంఖ్య‌లో చూస్తున్నారు. అయితే మ‌ళ్లీ ఇప్పుడు శ్రీకృష్ణ సీరియ‌ల్ కూడా రానుంది. ఇదే విషయాన్ని ప్రసారభారతి ట్విట్ట‌ర్లో తెలిపింది. 90ల‌లో ప్ర‌సార‌మైన పురాణ గాథ శ్రీకృష్ణ‌ని తిరిగి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు ట్వీట్ చేసింది.

ప్రేక్ష‌కుల కోరిక మేర‌కు 1990ల‌లో ప్ర‌సార‌మైన శ్రీకృష్ణ సీరియ‌ల్ ని త్వ‌ర‌లోనే తిరిగి ప్ర‌సారం చేయ‌నున్న‌ట్లు తెలిపింది. రామాయ‌ణం, మ‌హా భార‌తం సీరియ‌ల్స్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని.. ఆయా స‌మ‌యాల్లో ఎన్న‌డూ లేనంత‌గా దూర‌ద‌ర్శ‌న్ చూస్తున్నార‌ని చెప్పింది. శ్రీకృష్ణ ఏ స‌మ‌యంలో ప్ర‌సారం చేయాల‌న్న‌ది త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. 


logo