నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం పట్ల ఇటీవల పెద్ద వివాదమే చెలరేగింది. గతేడాది ఈయన నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కరోనా తీవ్రంగా ఉండటంతో అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. ఏడాది గడిచిపోయినప్పటికీ ఇంకా పరిస్థితులు కొలిక్కి రాలేదు. దీంతో టక్ జగదీష్ సినిమాను సైతం ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పలువురు నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు ఇప్పుడు సద్దుమణిగాయో లేదో.. ఈయన సినిమా ఇంకొకటి ఓటీటీలో రిలీజ్ కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన నాని 40 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్నాడు. ఒకానొక సమయంలో వరుస విజయాలతో స్టార్ హీరోలకు కూడా కాంపిటీషన్ ఇచ్చాడు. అయితే కరోనా నేపథ్యంలో ఇప్పుడు ఈయన నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ సినిమాను 40 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ విషయం తెలసి నాని ఫ్యాన్స్, థియేటర్ యజమానులు తెగ ఫీలయ్యారు. ఈ సమయంలో నాని సినిమాలను ఆపేస్తామంటూ ఎగ్జిబిటర్లు సీరియస్ కూడా అయ్యారు. కానీ ఆ తర్వాత ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. ఓటీటీలో తన సినిమాలు విడుదల కావడంపై నాని కూడా ఎమోషన్ అయ్యాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన నాని.. తన సినిమాలను కావాలని ఓటీటీలో విడుదల చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. థియేటర్స్‌లోకి జనాలు వచ్చే వీలున్నప్పుడు కూడా తన సినిమాలు డిజిటల్లోకి వస్తే ఆ క్షణం ఇండస్ట్రీనే వదిలేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏదేమైనా నాని సినిమాను థియేటర్లలో చూడాలని అనుకున్న ఫ్యాన్స్ మాత్రం ఫీలవుతున్నారు. ఇలాంటి సమయంలో నాని మరో సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతోందని తెలుస్తున్నది. అయితే అది ఆయన హీరోగా వస్తున్న సినిమా కాదు.. ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా.
ప్రస్తుతం నాని మీట్ క్యూట్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. సీనియర్ నటుడు సత్యరాజ్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే నిర్మాతగా నాని తొలి సినిమా అ..! కమర్షియల్ విజయంతో పాటు రెండు జాతీయ అవార్డులు తీసుకొస్తే.. రెండో సినిమా హిట్ పేరుకు తగ్గట్లే మంచి విజయం సాధించింది. ఇప్పుడు హిట్ సినిమాకు సీక్వెల్‌ను అడవి శేష్ ను హీరోగా పెట్టి నిర్మిస్తున్నాడు. వీటితో పాటే నాని నిర్మాణంలో ఈ మధ్యే సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో మీట్ క్యూట్ అనే సినిమా మొదలైంది. దీప్తి గంట ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. స్టార్ వాల్యూ కంటే కూడా కథ ప్రధానంగా సాగే సినిమాల వైపు ఎక్కువ అడుగులు వేస్తున్నాడు నాని. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నాని. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న తీరు చూస్తుంటే కూడా ఓటీటీ కోసమే అనిపిస్తుంది. మొత్తానికి నాని వరస సినిమాలు ఓటీటీలో వస్తుండటం ఆసక్తికరమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన ‘దర్శనం మొగులయ్య’ వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
Mogulaiah | పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
Trisha: మరోసారి వార్తలలోకి త్రిష పెళ్లి.. ఇది నిజం అంటున్న నెటిజన్స్
12 నిమిషాలలో అందంగా రెడీ అయ్యానంటూ మంచు లక్ష్మీ పోస్ట్