ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 21, 2020 , 19:58:59

‘మీటూ’పై పాయల్‌ ట్వీట్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌..

‘మీటూ’పై పాయల్‌ ట్వీట్‌.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌..

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్వీట్‌ చేస్తూ తనకు న్యాయం చేయాలని కోరంది. ‘అనురాగ్య కశ్యప్‌ నన్ను లైంగికంగా ఇబ్బందికి గురి చేశాడు. ‘నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. ఈ క్రియేటివ్ వ్యక్తి వెనుక ఉన్న రాక్షసుడిని ప్రజలకు చూపెట్టండి. ఇలా చెప్పడం నాకు హాని చేస్తుందని నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. నాకు సాయం చేయండి’ అని ట్వీట్ చేసింది. అయితే పాయల్ తనపై చేసిన ఆరోపణలను అనురాగ్ కశ్యప్ ఖండించారు. అలాగే మొదటి భార్య సయామీఖేర్‌, రెండో భార్య కల్కి కోచిన్‌, తాప్సీ పన్ను, అనుభవన్‌ సిన్హా, రాధికా ఆప్టే, దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మతో పాటు పలువురు అనురాగ్‌కు మద్దతుగా నిలిచారు.

ఇదిలా ఉండగా.. పలువురు ఔత్సాహికులు పాయల్‌ పాత ట్వీట్లను తవ్వడం ప్రారంభించారు. ఆమె టైమ్‌లైన్‌ నుంచి ఆరోపణలకు సంబంధించి చాలా విరుద్ధమైన ట్వీట్లను గుర్తించారు. ‘మీ టూ’ ఉద్యమాన్ని ఉద్దేశిస్తూ గతంలో పాయల్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌లో ‘ఇక్కడ ఎవరూ అత్యాచారం చేయరు. మీరు సౌకర్యంగా లేకుంటే వారు అవకాశం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. సింపుల్‌గా దూరంగా ఉండండి. అంత డ్రామా చేయవలసిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించింది. అప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం పాయల్‌ చేస్తున్న ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాయల్‌కు బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ మద్దతు తెలిపింది. అనురాగ్‌ కష్యప్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.