మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 12:16:41

ఏఆర్ రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ పాట‌

ఏఆర్ రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో ధనుష్ పాట‌

కొన్నేళ్ళ క్రితం కొలెవ‌రి ఢీ అనే పాట పాట‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు ధ‌నుష్‌. స్వయంగా ధ‌నుష్  పాడిన ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇప్పుడు అత్రంగీ రే చిత్రం కోసం మ‌ళ్ళీ త‌న గొంతు స‌వ‌రించుకుంటున్నాడు ‌. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఏ ఆర్ రెహ‌మాన్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఏఆర్ రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో పాట పాడిన‌ట్టు చెప్పుకొచ్చాడు.

ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో అత్రంగీ రే చిత్రం తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో అక్ష‌య్ కుమార్, సారా అలీఖాన్ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వ్యాలంటైన్స్ డే గిఫ్ట్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ కంపొజీష‌న్‌లో ధ‌నుష్ పాడిన పాట‌కోసం సంగీత ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.