HBD Pawan kalyan | ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. వాళ్లు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలు అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోతాయి. మరీ ముఖ్యంగా డైరెక్టర్, రైటర్ కాంబినేషన్స్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- విజయ భాస్కర్, ఇప్పుడు ప్రసన్నకుమార్- బెజవాడ త్రినాథరావు నక్కిన, కోన వెంకట్- శ్రీను వైట్ల.. ఇలా రైటర్ డైరెక్టర్ కాంబినేషన్‌కు సైతం అభిమానులు ఉన్నారు. అలాంటి ఒక అద్భుతమైన కాంబినేషన్ సురేందర్ రెడ్డి – వక్కంతం వంశీ. ఈ ఇద్దరు కలిసి పనిచేస్తే అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. కిక్, రేసుగుర్రం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ కాంబినేషన్లోనే లోనే వచ్చాయి.
మధ్యలో కొన్ని కారణాల వల్ల ఈ జోడీ విడిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ కోసం మళ్లీ సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కలిసి పని చేయబోతున్నారు. పవన్ 29వ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. పవర్ స్టార్‌కు అత్యంత సన్నిహితుడు రామ్ తాళ్లూరి ఈ సినిమాకు నిర్మాత. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. తాజాగా విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. యథా కాలమ్.. తథా వ్యవహారమ్ అంటూ ఒక గన్ను పెట్టి పోస్టర్ డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనింగ్ కథను సిద్ధం చేశాడు వక్కంతం వంశీ.
ప్రస్తుతం అఖిల్‌తో ఏజెంట్ సినిమా తెరకెక్కిస్తున్నాడు సురేందర్ రెడ్డి. దీని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్‌పైకి రానుంది. సురేందర్ రెడ్డి చాలా కాలం తర్వాత వక్కంతం వంశీతో కలిసి పని చేస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 2022 సమ్మర్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. మరి పవన్ కోసం కలిసిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ పాడిన ఈయన ఎవరు ? నేపథ్యమేంటి ?
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడిన దర్శనం మొగులయ్య వాడే వాద్య పరికరం ఏంటో తెలుసా?
పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే గిఫ్ట్.. ఆర్జీవీ చెంప పగులగొట్టిన ఆషురెడ్డి